బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కరీంనగర్ వాసి


బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కరీంనగర్ వాసి
*లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ నాగరాజు
British Parliament elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్ని కల్లో తెలుగు బిడ్డ పోటీ చేస్తున్నారు . ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్ని కల బరిలో నిలిచారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ కాండిడేట్ గా పార్టీ పక్రటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ బౌండరీ కమిషన్ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ లో ఉన్నారు.ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కులస్ పక్రారం ఈ నియోజకవర్గంలో 68 శాతం ఓట్ల తో లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యం లో నాగరాజు పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. భారత్ లో ఉన్నట్టుగానే ప్రస్తుతం బ్రిటన్‌లోనూ ఎన్నికల హడావిడి మొదలైంది. . అక్కడ కూడా ప్రచార హోరుతో అభ్యర్థులపై ఫోకస్ పెరిగింది..ఈ నేపథ్యం లోనే భారత సంతతి కి చెందిన నాగరాజు బ్యాక్ గ్రౌండ్ ఏంటంటూ నెట్టింట సెర్చింగ్ మొదలైంది.
ఉదయ్ నాగరాజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్‌లో అడ్మినిస్ట్రేటివ్ సైన్స్‌లో పీజీ చేశారు. భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్‌ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు
బ్రిటన్ లోని క్షేతస్ర్థాయి సమస్యలపైన ఉదయ్‌కు మంచి పట్టుఉంది. స్కూ ల్ గవర్నర్‌గా, వాలంటీర్‌గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా ఒక దశాబ్దకాలంగా సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన పెంచుకున్నారు. నాగరాజు పోటీ చేస్తున్న లేబర్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



