Bihar: బీహార్‌ నలందలో బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలుడిని రక్షించిన రెస్క్యూ టీమ్‌

A Rescue Team Rescued A Three Year Old Boy Who Fell Into A Borewell In Bihar Nalanda
x

Bihar: బీహార్‌ నలందలో బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలుడిని రక్షించిన రెస్క్యూ టీమ్‌

Highlights

Bihar: దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి వెలికితీసిన రెస్క్యూ టీమ్‌

Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. 40 అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని సురక్షితంగా వెలికితీశారు. బీహార్ లోని నలంద జిల్లా కుల్ గ్రామంలో మూడేళ్ల బాలుడు ఉదయం బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరుబావికి సమాంతరంగా జేసీబీలతో గోతిని తవ్వారు. బాలుడి ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఆక్సిజన్ పంపారు. 40 అడుగుల లోతులో బాలుడిని గుర్తించిన రెస్క్యూ టీమ్స్‌.. లోపలకు పైప్‌ను పంపి బాలుడిని వెలికితీశారు. బాలుడు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారిని బయటకు తీయగానే.. తక్షణ వైద్య సహాయం అందించారు డాక్టర్లు. ఆక్సిజన్ సౌకర్యాలతో కూడిన వైద్య బృందాలు బాలుడిని అంబులెన్స్‌‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి.

ఓ రైతు నీళ్ల కోసం బోరుబావి తవ్వేందుకు యత్నించగా.. విజయవంతం కాలేదు. దీంతో వేరే ప్రాంతంలో మరో బోరుబావి తవ్వించాడు. నీళ్లు పడకపోవడం వల్ల దానిని పూడ్చకుండా అలాగే వదిలేశాడు. ఆ బోరుబావి ప్రాంతంలో తల్లి పొలం పనులు చేస్తుండగా.. బాలుడు పక్కనే ఆడుకుంటూ ఉన్నాడు. ఆ క్రమంలో కాలుజారి బోరుబావిలో పడిపోయాడు. వెంటనే అధికారులకు సమాచారం చేరవేయగా.. రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు NDRF సిబ్బంది. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి బాలుడిని సురక్షితంగా వెలికితీశారు. బాలుడు బయటకు రావడంతో స్థానికులు, కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories