బెంగళూరులో కరెన్సీ నోట్ల వర్షం.. బ్రిడ్జ్ పైనుంచి నోట్లను విసిరేసిన..

A man Throws Currency Notes from a Flyover in Bengaluru
x

బెంగళూరులో ఓ వ్యక్తి ఫ్లైఓవర్ మీద నుంచి కరెన్సీ నోట్లను విసిరేశాడు

Highlights

Bengaluru: ఫ్లై ఓవర్ నుంచి ఎగిరిపడిన రూ.10 నోట్లు

Bengaluru: బెంగళూరులో ఓ వ్యక్తి ఫ్లైఓవర్ మీద నుంచి కింద కరెన్సీ నోట్లను విసిరేశాడు. దీంతో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని బిజీ మార్కెట్ వద్ద ఉన్న బిడ్జ్ మీద నుంచి అతను ఆ కరెన్సీని వెదజల్లాడు. ఆ వ్యక్తి నోట్లు విసిరేస్తున్న సమయంలో కొందరు వీడియోలు తీశారు. కొందరు అతని వద్దకు వెళ్లి డబ్బు తమకు ఇవ్వాలంటూ వేడుకున్నారు. కేఆర్ మార్కెట్ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగింది. అయితే ఫ్లైఓవర్ కింద ఆ కరెన్సీ నోట్లను అందుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. 10 రూపాయల నోట్లను అతను విసిరేసినట్లు తెలుస్తోంది. సుమారు 4వేల విలువైన నోట్లను ఫ్లై ఓవర్ పైనుంచి విసిరేసినట్లు తెలుస్తోంది. అయితే బ్రిడ్జ్ మీద నుంచి డబ్బులు విసిరేసిన ఆ వ్యక్తి ఎవరు..? అతను ఎందుకు అలా చేశాడన్న దానిపై వివరాలు తెలియరాలేదు. పోలీసులు వచ్చేలోపు అతను పారిపోవడంతో కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories