భార్య కాపురానికి రావాలని.... మెడలో నాటు బాంబుల దండ వేసుకుని

భార్య కాపురానికి రావాలని.... మెడలో నాటు బాంబుల దండ వేసుకుని
x
Highlights

భార్య కాపురానికి రావాలని ఓ భర్త మెడలో నాటు బాంబుల దండ వేసుకుని హల్‌చల్ చేశాడు... అతడు చేసిన ఈ పనికి కుటుంబ సభ్యలకు మరియు పోలీసులను ఒక్కసారిగా...

భార్య కాపురానికి రావాలని ఓ భర్త మెడలో నాటు బాంబుల దండ వేసుకుని హల్‌చల్ చేశాడు... అతడు చేసిన ఈ పనికి కుటుంబ సభ్యలకు మరియు పోలీసులను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడుకి చెందిన మణికంఠన్‌కు భార్య,రెండేళ్ళ కొడుకు ఉన్నాడు . కానీ అతని భార్య తన కొడుకుని తీసుకొని ఏడాది కింద తన పుట్టింటికి వచ్చింది.ఈ క్రమంలో విడాకులను దరఖాస్తు చేసింది. అయితే విడాకులు ఇస్తే ఇక తన భార్య తనకి దక్కదని మణికంఠన్‌ భార్యను తిరిగి తన దగ్గరకు రావాలంటూ మెడలో నాటు బాంబుల దండ వేసుకుని, చేతిలో కిరోసిన్ డబ్బా పట్టుకుని అత్తవారింటి ముందు హల్‌చల్ చేశాడు.

ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అర్ధం చేసుకని చాకచక్యంగా వ్యవహరిస్తూ అతడి రెండేళ్ల కుమారుడిని తీసుకొచ్చి అతని దగ్గర వదిలారు.. నీ కొడుకు భవిష్యత్ కోసమైనా ఆత్మహత్య చెసుకొవద్దని చెప్పుకొచ్చారు . దీనితో మణికంఠన్ తన ప్రయత్నాన్ని విరమించుకొని తన కొడుకున్ని గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని మందలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories