జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో భారీ అగ్ని ప్రమాదం

A Fire Broke out in Shops in Sultanpora Kandi area in Baramulla
x

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో భారీ అగ్ని ప్రమాదం 

Highlights

Jammu & Kashmir: సుల్తాన్‌పొరాఖడి ప్రాంతంలో దుకాణాలకు అంటుకున్న మంటలు

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుల్తాన్‌పొరాఖడి ప్రాంతంలో ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు పక్కనే ఉన్న షాపులకు అంటుకున్నాయి. ఇలా దాదాపు 8 దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో..దుకాణాల్లోని సామగ్రి అంతా కాలిబూడిదైంది. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories