Bihar: బిహార్‌ మోతిహరిలో నాటు సారా తాగి 8మంది మృతి

8 People Died After Drinking Natu Sara in Motihari Bihar
x

Bihar: బిహార్‌ మోతిహరిలో నాటు సారా తాగి 8మంది మృతి

Highlights

Bihar: 2016లోనే మద్యం అమ్మకాలపై నిషేధం విధించిన సర్కార్.. అయినా దొడ్డిదారిన సాగుతున్న సారా అమ్మకాలు

Bihar: బిహార్‌లోని మోతీహరి జిల్లా లక్ష్మీపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నాటు సారా తాగి 8 మంది మృతి చెందారు. మరో 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బిహార్ సీఎం 2016 లోనే రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై పూర్తి నిషేదాన్ని విధించారు. అయినప్పటికీ పలు చోట్ల బ్లాక్ లో మద్యం అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికంగా తయారైన మద్యం తాగి తరచూ మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో కూడా కల్తీ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories