78 శాతం తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలకు పంపడానికి ఇష్టపడటం లేదు..

78 శాతం తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలకు పంపడానికి ఇష్టపడటం లేదు..
x
Highlights

కరోనా మహమ్మారి కారణంగా నెలల తరబడి మూసివేసిన పాఠశాలలను తెరుచుకోవడానికి కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 21 నుండి పాఠశాలలు 9...

కరోనా మహమ్మారి కారణంగా నెలల తరబడి మూసివేసిన పాఠశాలలను తెరుచుకోవడానికి కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 21 నుండి పాఠశాలలు 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు తిరిగి తెరుచుకోవచ్చని సూచించింది. అయితే, దీని కోసం పాటశాలలు మొదట తల్లిదండ్రులు, విద్యార్థుల నుండి అనుమతి తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వం. తల్లిదండ్రులు , పిల్లల ఇష్టంతోనే పాఠశాలలకు వెళ్ళేది లేనిదీ ఆధారపడి ఉంటుందని తెలిపింది.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తల్లిదండ్రులు తమ బిడ్డను పాఠశాలకు పంపించడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా? లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ ఎస్పీ రోబోటిక్స్ వర్క్స్ ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం, అంటువ్యాధి ముగిసే వరకు 78 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించటానికి ఇష్టపడటం లేదని తేలింది.

అధ్యయనం ప్రకారం, హైదరాబాద్, బెంగళూరులో నివసిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. అయితే ఈ ప్రాంతాలతో పోలిస్తే చెన్నై , కోల్‌కతాలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలతో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ 64 శాతం తల్లిదండ్రులు ఆన్‌లైన్ విద్య కంటే తరగతిగదే మేలని అభిప్రాయపడుతున్నారు.

తల్లిదండ్రుల వృత్తి యొక్క ప్రభావ అధ్యయనం ప్రకారం.. ఉద్యోగులైన తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఈ సర్వేలో తేలింది. అలాంటి తల్లిదండ్రులలో 17% మాత్రమే తమ పిల్లలను పాఠశాలకు పంపాలని కోరుకుంటున్నారు. 30 శాతం స్వయం ఉపాధి , 56 శాతం ఫ్రీలాన్సర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు పాఠశాల తెరిచిన వెంటనే తమ పిల్లలను పాఠశాలకు పంపాలని కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories