Corona Cases in India: ఇవాళ కొత్తగా 7,240 కరోనా కేసులు నమోదు

Corona Cases in India: గడిచిన 24 గంటల్లో కరోనాతో 7 మంది మృతి
x

Corona Cases in India: ఇవాళ కొత్తగా 7,240 కరోనా కేసులు నమోదు

Highlights

Corona Cases in India: గడిచిన 24 గంటల్లో కరోనాతో 7 మంది మృతి

Corona Cases in India: దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ టెన్షన్‌ పెడుతున్నాయి. వరుసగా రెండో రోజు 40శాతం పైగా కేసులు పెరిగాయి. నిన్న ఐదువేల మార్కును దాటిన కేసులు ఇవాళ ఏడువేల మార్క్‌ను దాటాయి. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళల్లోనే నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లోనూ 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 8 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మూడు నెలల తరువాత రెండో రోజు 5వేల కేసులను దాటాయి. రోజువారీ కేసులు పెరుగుతుండడంతో నాలుగో వేవ్‌ వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్‌ కేసులపై ప్రపంచ రోగ్య సంస్థ బాంబు పేల్చింది. మంకీపాక్స్‌ వైరస్‌తో నిజమైన ముప్ప పొంచి ఉందని స్పష్టం చేసింది.

94రోజుల తరువాత దేశంలో కరోనా కేసులు 7వేల మార్క్‌ను దాటాయి. 24 గంటల్లో 7వేల 240 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందారు. కొత్త కేసుల్లో 40 శాతం మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 2వేల 701 కేసులు, కేరళలో 2వేల 271 కేసులు నమోదయ్యాయి. కేరళలో వారం రోజుల్లో 10వేల 805 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 564, కర్ణాటకలో 376, హర్యానా 247, తమిళనాడులో 195, యూపీలో 163, తెలంగాణలో 116, గుజరాత్‌లో 111, కేసులు నమోదయ్యాయి. కేరళలో వైరస్ బారిన పడి నలుగురు మృతి చెందారు. రెండో రోజు వరుసగా ఐదు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న 5వేల 233 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండడంతో ముంబై, పూణే, థానే, పల్‌ఘర్‌ జిల్లాల్లో మాస్క్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 111 రోజుల తరువాత పాజిటివ్‌ రేటు 2శాతానికి పెరిగింది. ఇక కేరళ కూడా మాస్క్‌ను తప్పనిసరి చేసింది.

తాజాగా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో మళ్లీ టెన్షన్ మొదలయింది. కొన్నాళ్లుగా నిత్యం 2వేల నుంచి మూడు వేల మధ్య అటుఇటుగా కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా పెరిగింది. 7వేల మార్కును దాటింది. దీంతో ఫోర్త్‌ వేవ్‌ వస్తుందేమో అనే ఆందోళన పలువురిలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం టీకాలు తీసుకున్నా వైరస్‌ సోకుతుండడం కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు చిన్నారులకు కూడా కరోనా సోకుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు. త్వరలో విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను పంపాలా వద్దా? అని తల్లిదండ్రులు డైలమాలో పడుతున్నారు. పిల్లలకు స్కూళ్లకు పంపి.. రిస్క్‌ చేయడం ఎందుకుని యోచిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ఆందోళన అక్కర్లేదని భరోసా ఇస్తున్నారు. కేసులు పెరుగుతున్నా ప్రాణాపాయం తక్కువని చెబుతున్నారు. టీకా తీసుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలంటున్నారు.

కరోనా పరిస్థితి ఇలా ఉంటే మంకీపాక్స్‌ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం 29 దేశాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. అయితే ఆయా దేశాల్లో ఇప్పటివరకు ఎలాంటి మరణం నమోదు కాలేదు. కేవలం ఆప్రికా దేశమైన నైజీరియాలో మాత్రం ఇటీవల మంకీపాక్స్‌ సోకి ఒకరు చనిపోయారు. ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఈ వైరస్‌తో ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా బాంబు పేల్చింది. మంకీపాక్స్‌ వేగంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే కారణమని తేల్చి చెప్పింది. ఈ వైరస్‌ సోకిన వారితో శారీరకంగా కలవడంతోనే వ్యాప్తి చెందుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టె్రడోస్‌ అధనామ్‌ తెలిపారు. తుంపర్ల ద్వారా మంకీపాక్స్‌ సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఇదేమీ పాత కొత్త వ్యాధి కాదని పాతదేనని భయపడాల్సిన పని లేదని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

మంకీపాక్స్ తొలికేసును 1950లో గుర్తించారు. పరిశోధనల నిమిత్తం కోతులపై ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఈ వైరస్‌ బయటపడింది. అయితే మనుషుల్లో మాత్రం 1970లో కాంగోలో గుర్తించారు. దీన్ని మినీపాక్స్‌ వైరస్‌ పిలుస్తారు. ఇది ఆర్థోపాక్స్‌ వైరస్‌ జాతికి చెందినది. మంకీపాక్స్ ప్రధానంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆఫ్రికా ఖండంలో నమోదైన వేలాది మంకీపాక్స్ కేసులు చాలావరకు అపరిశుభ్రత, జంతువుల ద్వారానే వ్యాపించింది. శారీరక కలయిత ద్వారా వ్యాపించిన కేసులు చాలా తక్కువ. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లనొప్పులతో ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలు 2 నుంచి 4 వారాల వరకు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఇప్పటివరకు ఎవరూ మృతి చెందలేదు. వైరస్‌ బారిన పడిన వారు ఇతరులకు దూరంగా, సాధారణ ఫ్లూ కోసం తీసుకునే జాగ్రత్తలనే తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

మన దేశంలో మంకీపాక్స్‌ కేసులు నమోదు కాలేదు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుకు అవసరమైన టీకాలను అందుబాటులో ఉంచింది. అయితే పెరుగుతున్న కరోనా కేసులు మాత్రం ప్రజలను టెన్షన్‌ పెడుతున్నాయి. మరోవైపు కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కోవిడ్‌ కట్టడికి చర్యలు చేపడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories