ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఓనర్ సహా ఏడుగురు మృతి..

ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఓనర్ సహా ఏడుగురు మృతి..
x
Highlights

ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో.. ఏడుగురు మృతి చెందిన సంఘటన..

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని ఫైర్‌క్రాకర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. నలుగురు గాయపడ్డారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కర్మాగారం కట్టుమన్నార్కోయిల్ పట్టణంలో ఉంది. ఇది చెన్నై నుండి 190 కిలోమీటర్లు ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మీడియా నివేదికల ప్రకారం, ఫ్యాక్టరీలో పేలుడు శబ్దం మూడు కిలోమీటర్ల వరకు వినిపించింది. పేలుడు వల్ల ఫ్యాక్టరీకి భారీ నష్టం వాటిల్లింది.. ఫైర్‌క్రాకర్ ఫ్యాక్టరీ భవనం మొత్తం కుప్పకూలిపోయింది.

చనిపోయిన వారిలో ఫ్యాక్టరీ యజమాని కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు సంభవించగానే కొద్దిసేపటికే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ ఇంజన్ సిబ్బంది ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. మృతులను వెలికి తీసిన సిబ్బంది వారిని గుర్తించే పనిలో పడింది. కాగా ఫైర్‌క్రాకర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఆ ప్రాంత ప్రజలంతా బెంబెల్త్తిపోయారు. కాసేపు ఏమి జరుగుతుందో అర్ధం కాక గందరగోళానికి గురయ్యారు. మరోవైపు భద్రతా సిబ్బంది కూడా స్థానికులను దూరంగా పంపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories