లిబియాలో ఏడుగురు భారతీయుల కిడ్నాప్.. అందులో ఆంద్ర వ్యక్తి..

లిబియాలో ఏడుగురు భారతీయుల కిడ్నాప్.. అందులో ఆంద్ర వ్యక్తి..
x
Highlights

ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు భారతీయులు గత నెలలో లిబియాలో కిడ్నాప్ అయ్యారని, వారి విడుదల కోసం ఆ దేశంలోని అధికారులతో భారత్..

ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు భారతీయులు గత నెలలో లిబియాలో కిడ్నాప్ అయ్యారని, వారి విడుదల కోసం ఆ దేశంలోని అధికారులతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ట్యునీషియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు.. లిబియా ప్రభుత్వ అధికారులతో పాటు అక్కడ ఉన్న అంతర్జాతీయ సంస్థలను సంప్రదిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. సెప్టెంబరు 14 న భారతీయులు ఫ్లైట్ క్యాచ్ చేయడానికి ట్రిపోలీ విమానాశ్రయానికి వెళుతుండగా అశ్వరీఫ్ అనే ప్రదేశంలో కిడ్నాప్ చేయబడ్డారని శ్రీవాస్తవ మీడియా సమావేశంలో తెలిపారు.

ఇప్పటికే.. ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిందని.. అంతేకాకుండా లిబియా అధికారులు మరియు వారు పనిచేస్తున్న యజమానితో సంప్రదించి, వారిని భారత్ కు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. బాధితులు నిర్మాణ, చమురు క్షేత్ర సరఫరా సంస్థలో పనిచేస్తున్నారని శ్రీవాస్తవ తెలిపారు. వారి యజమాని చెప్పిన మాటల ప్రకారం భారత పౌరులు కిడ్నాపర్ల చెరలో సురక్షితంగానే ఉన్నారని.. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంపించారని శ్రీవాస్తవ చెప్పారు.

ఇదిలావుంటే ఉత్తర ఆఫ్రికాలో చమురు సంపన్న దేశంగా లిబియా ఉంది, లిబియాను ముఅమ్మర్ గడాఫీ నాలుగు దశాబ్దాలకు పైగా పాలించాడు.. ఆయన పాలనలో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే 2011 లో వారికి విముక్తి లభించింది. గడాఫీ మొత్తం 42 ఏళ్లపాటు లిబియాను పాలించాడు. ఒకప్పుడు చాలా ఆకర్షణీయ వ్యక్తిత్వం అనిపించుకున్న గడాఫీ 1969లో రక్తం చిందకుండా జరిగిన తిరుగుబాటుతో లిబియా రాజు ఇద్రీస్‌ నుంచి అధికారం హస్తగతం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories