logo
జాతీయం

రేపు దేశవ్యాప్తంగా ఆరోదశ లోక్ సభ ఎన్నికలు

రేపు దేశవ్యాప్తంగా ఆరోదశ లోక్ సభ ఎన్నికలు
X
Highlights

రేపు దేశవ్యాప్తంగా ఆరోదశ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు...

రేపు దేశవ్యాప్తంగా ఆరోదశ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు. మొత్తం 59 స్థానాలకు పోలింగ్‌ జరగబోతోంది. మొత్తం 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటివరకూ దాదాపు 400 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఆరో దశలో బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, హర్యానా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీ, హర్యానాలో ఆసక్తికర పోరు ఉంది. పోలింగ్ కోసం లక్షా 13 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు అమర్చారు. బీహార్‌లో 8, హర్యానాలో 10 (మొత్తం స్థానాలు), జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8, ఢిల్లీలోని మొత్తం 7 లోక్ సభ స్థానాలకూ ఆరో దశలో పోలింగ్ జరగబోతోంది.

Next Story