ఆదివారం ఆరో విడత పోలింగ్‌.. అదృష్టాన్ని పరీక్షించుకోనున్న సినీ, క్రీడారంగ ప్రముఖులు

ఆదివారం ఆరో విడత పోలింగ్‌.. అదృష్టాన్ని పరీక్షించుకోనున్న సినీ, క్రీడారంగ ప్రముఖులు
x
Highlights

సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి వచ్చేసింది. ఏడు దశల ఎన్నికల్లో ఇప్పటికే ఐదు దశలు పూర్తి కాగా.. ఆదివారం ఆరో విడత పోలింగ్‌ జరగనుంది. ఏడు...

సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి వచ్చేసింది. ఏడు దశల ఎన్నికల్లో ఇప్పటికే ఐదు దశలు పూర్తి కాగా.. ఆదివారం ఆరో విడత పోలింగ్‌ జరగనుంది. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి 14, హరియాణా 10, బిహార్‌ 8, మధ్యప్రదేశ్‌ 8, పశ్చిమబెంగాల్‌ 8, ఢిల్లీ 7, ఝార్ఖండ్‌ 4 స్థానాలలో పోలింగ్ జరగనుంది. రో విడత ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పోటీ చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భోజ్‌పురి లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. అఖిలేశ్‌కు పోటీగా ప్రముఖ నటుడు దినేశ్‌లాల్‌ యాదవ్‌ను బీజేపీ పోటీలోకి దింపింది.

న్యూఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున సీనియర్‌ నేత అజయ్ మాకెన్ బరిలో ఉన్నారు. భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పోటీపడుతున్నారు. ఈస్థానంలో బీజేపీ అభ్యర్థిగా సాద్వీ ప్రజ్ఞాసింగ్‌ పోటీలో ఉన్నారు ఈస్ట్ ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్‌ నుంచి కేంద్ర మంత్రి మేనకాగాంధీ బరిలోకి దిగారు. సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలో నిలిచారు. హరియాణాలో సోనిపత్‌ నుంచి మాజీ సీఎం భూపేందర్‌సింగ్‌ హుడా కాంగ్రెస్‌ తరుపున బరిలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories