భారత్‌లో త్వరలో అందుబాటులోకి 5జీ సేవలు

5G Services to be Available in India Soon
x

భారత్‌లో త్వరలో అందుబాటులోకి 5జీ సేవలు

Highlights

5G in India: తొలుత 20 నుంచి 25 నగరాల్లో 5జీ సేవలు

5G in India: భారత్‌లో త్వరలోనే 5 జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యంత వేగవంతమైన మొబైల్ టెలికాం సేవలకు 5జీ వీలుకల్పిస్తుంది. 72 గిగా హెర్జ్ 5జీ కేటాయింపుల కోసం వేలం ప్రారంభం అయ్యింది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా, ఆధాని ఎంటర్ ప్రైజెస్ వేలంలో పాల్గొన్నాయి. మొత్తం 4.3 లక్షల కోట్ల విలువైన ఈ వేలంలో తొలి రోజు నాలుగు రౌండ్ల బిడ్డింగ్ జరిగింది. 1.45 లక్షల కోట్లు విలువైన బిడ్లు దాఖలయ్యాయి. 700 మెగా హెర్ట్జ్ ల 5జీ బ్యాండ్ కోసం కూడా కంపెనీలు బిడ్లను సమర్పించాయి. బుధవారం ఐదో రౌండ్ వేలం నిర్వహించనున్నారు. ఇందు కోసం రిలయన్స్ జియో 14 వేల కోట్లు, ఎయిర్ టెల్ 5,500 కోట్లు, వొడా ఫోన్ ఐడియా రెండు వేల రెండు వందల కోట్లు, ఆధానీ డాటా నెట్ వర్క్స్ వంద కోట్లు ముందస్తు డిపాజిట్ చేశాయి.

5 జీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 5జీబీ మూవీ వీడియోను 35 సెకన్లలోనే డౌన్ లోడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే మూవీని 4జీ ఇంటర్నెంట్ తో డౌన్ లోడ్ చేయడానికి 40 నిమిషాలు, 3జీతో డౌన్ లోడ్ చేయడానికి రెండు గంటల సమయం పడుతుంది. 2 జీ ఇంటర్నెట్ డౌన్ లోడ్ చేసేందుకు దాదాపు 2.8 గంటల సమయం అవసరం ఉంటుంది. 5జీ స్పెక్ట్రం వేగం 4జీ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కనెక్టివిటీ విషయంలో అవాంతరాలు కూడా వైదొలుగుతాయి. సమాచారాన్ని చాలా వేగంగా షేర్ చేసుకునేందుకు వీలుగా కొట్లాది డివైజులు అనుసంధానించడం సాధ్యమవుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెట్ వర్క్ పని చేస్తుంది. ఒకే సారి హ్యాండ్ సెట్లు, సిస్టమ్ డేటాను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెట్ వర్క్ పని చేస్తుంది. ఒకే సారి హ్యాండ్ సెట్లు, సిస్టమ్ డేటాను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. ఈ-హెల్త్, వాహనాల కనెక్టివిటీ వంటి అనేక సొల్యూషన్స్ కు ఎంతో సమర్ధవంతంగా పని చేస్తుంది.

మొదటగా దేశంలోని 20 నుంచి 25 నగరాల్లో 5జీ అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆగస్టు 15 నాటికి స్పెక్ట్రమ్ కేటాయింపులు పూర్తవుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని పలు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 3300 మెగాహెర్జ్, 26 గిగాహెర్జ్ బాండ్స్ కోసం కంపెనీలు తీవ్రంగా పోటీపడ్డాయని మంత్రి వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories