logo
జాతీయం

Corona Cases In India: గడిచిన 24గంటల్లో 46,759 మందికి కరోనా

46,759 New Coronavirus Cases Reported in India Today 28 08 2021 | Today Corona Cases in India
X

గడిచిన 24గంటల్లో 46,759 మందికి కరోనా

Highlights

Corona Cases In India: * 24 గంటల్లో 509 మంది మృతి * ఒక్క కేరళలోనే 32,801 పాజిటివ్ కేసులు

Corona Cases In India: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నివురుగప్పిన నిప్పులా ఉంది.. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చతగ్గుదలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో క్రియాశీల కేసులు పెరుగుతుండటం, రికవరీ రేటు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో 46 వేల 759 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో మొత్తంగా కేసుల సంఖ్య 3.26 కోట్లు చేరింది. ముందు రోజుతో పోల్చితే కేసుల్లో 4.7 శాతం పెరుగుదల కనిపించిందని కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

కోవిడ్ సోకి మరో 509 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంక్య 4 లక్షలు 37 వేలు దాటింది. మరోవైపు.. ఒక్క కేరళలోనే 32 వేల 801 కేసులు వెలుగు చూశాయి. దీంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3 లక్షల 59 వేల మందికి వైరస్ తో బాధపడుతున్నారు. గడిచిన 24గంటల్లో 31 374 మంది రికవరీ అయి డిశ్చార్జ్ అయ్యారు.. ఇవాళ కూడా కొత్త కేసుల కంటే రికవరీలే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 97.56 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

Web Title46,759 New Coronavirus Cases Reported in India Today 28 08 2021 | Today Corona Cases in India
Next Story