Coronavirus: భోపాల్ లో ఒకేసారి 44 మంది డిశ్చార్జ్

Coronavirus: భోపాల్ లో ఒకేసారి 44 మంది డిశ్చార్జ్
x
Highlights

భోపాల్ బుధవారం, 44 మంది ఒకేసారి కరోనా సంక్రమణ నుండి కోలుకున్నారు. నిన్న సాయంత్రం వివా ఆసుపత్రి నుంచి వారంతా డిశ్చార్జ్ అయ్యారు.

భోపాల్ బుధవారం, 44 మంది ఒకేసారి కరోనా సంక్రమణ నుండి కోలుకున్నారు. నిన్న సాయంత్రం వివా ఆసుపత్రి నుంచి వారంతా డిశ్చార్జ్ అయ్యారు.వీరు డిశ్చార్జ్ అయినప్పటికీ ఇంట్లో నిర్బంధంలో ఉండాలని వైద్యులు సూచించారు. మహమ్మారి నుండి కోలుకునేలా చేసిన వైద్యులు, సిబ్బందికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు, ఈ ఆసుపత్రి నుండి ఇద్దరు ఐఎఎస్ అధికారులతో సహా మొత్తం 30 మంది శుక్రవారం తమ ఇళ్లకు వెళ్లారు. ఇక ఒకేసారి 44 మంది డిశ్చార్జ్ కావడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు.

డిశ్చార్జ్ అయ్యేముందు మొత్తం 44 మందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి అందరినీ అభినందించారు. కరోనాపై జరిగే యుద్ధంలో రాష్ట్రము విజయం సాధించాలని.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచనలు పాటించి సహకరించాలని కోరారు. లాక్డౌన్ కు సహకరించి రాష్ట్ర మరియు దేశం అభివృద్ధి, పురోగతికి తోడ్పడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే మధ్యప్రదేశ్ లో కరోనా కేసులు 1,587 ఉండగా.. ఇందులో 152 మంది కోలుకున్నారు.. 80 మంది మృతి చెందారు.. ప్రస్తుతం 1,355 క్రియాశీల కేసులు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories