Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదంలో వెలుగులోకి కొత్త విషయాలు.. విద్యుత్‌ షాక్‌తోనే 40 మంది మృతి..!

40 People died Due to Electric Shock in Odisha Train Tragedy
x

Odisha Train Tragedy: ఒడిశారైలు ప్రమాదంలో వెలుగులోకి కొత్త విషయాలు.. విద్యుత్‌ షాక్‌తోనే 40 మంది మృతి..!

Highlights

Odisha Train Tragedy: విద్యుత్‌ షాక్‌ తో 40 మంది వరకూ చనిపోయినట్టు గుర్తింపు

Odisha Train Tragedy: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 278 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కనీసం 40 మంది విద్యుత్‌ షాక్‌ వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది.. పట్టాలు తప్పిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఇందులో కనీసం 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలైన ఆనవాళ్లు కన్పించలేదని ఆ పోలీసు అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగి బోగీలపై పడిందని, దీంతో విద్యుత్‌ షాక్‌ జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు.

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్‌ రైలును ఢీకొట్టిన తర్వాత ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో కొన్ని పక్కనున్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో ఆ మార్గంలో బెంగళూరు-హావ్‌రా ఎక్స్‌ప్రెస్‌ రావడంతో.. ఆ రైలు పట్టాలు తప్పిన కోరమాండల్‌ బోగీలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఓవర్‌హెడ్‌ లోటెన్షన్‌ లైన్‌ విద్యుత్‌ తీగలు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో విద్యుదాఘాతం కూడా చోటుచేసుకుంది. బోగీల మధ్య నలిగిపోవడంతో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. అయితే, దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు కన్పించలేదు. రక్తస్రావం జరిగిన ఆనవాళ్లూ లేవు. బోగీలపై లోటెన్షన్‌ వైర్‌ పడి విద్యుత్‌ ప్రసరించడంతో వీరు కరెంట్‌ షాక్‌కు గురై చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నామని ఆ పోలీసు అధికారి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories