దక్షిణ కాశ్మీర్‌లోని మరో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదుల ఏరివేత

దక్షిణ కాశ్మీర్‌లోని మరో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదుల ఏరివేత
x
Highlights

దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్‌లో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బంది.. నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు.

దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్‌లో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బంది.. నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. మంగళవారం సాయంత్రం వారు మల్హురా జనపోరా గ్రామంలో దాక్కున్నట్లు.. తమకు సమాచారం అందినట్లు ఆర్మీ, పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతరం సంయుక్త ఆపరేషన్ జరిగింది.

ప్రస్తుతం ఆపరేషన్ ముగిసిందని పోలీసులు తెలిపారు. కాగా ఏప్రిల్‌లో ఇప్పటివరకు నాలుగు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో 13 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

కాగా ఏప్రిల్ 17 న రెండు వేర్వేరు ప్రదేశాలలో ఎన్కౌంటర్లు జరిగాయి, ఇందులో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. అలాగే ఏప్రిల్ 11 న కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి.. ఇందులో ఉగ్రవాదులు ఆయుధాలను వదిలి పారిపోయారు. ఇక ఏప్రిల్ 7న 5 మంది ఉగ్రవాదులను హతమార్చింది సైన్యం. అలాగే ఏప్రిల్ 4 న కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు నలుగురు హిజ్బుల్ ఉగ్రవాదులను హతమార్చాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories