భారత్ లో కరోనా ఉద్ధృతి.. మహారాష్ట్రలో అత్యధిక మరణాలు..

భారత్ లో కరోనా ఉద్ధృతి.. మహారాష్ట్రలో అత్యధిక మరణాలు..
x
Highlights

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఇక దేశవ్యాప్తంగా శుక్రవారం అత్య‌ధికంగా ఒక్క రోజే 1755 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో వైర‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. గడిచిన 24 గంటల్లో 72మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం 77మంది మారణించిన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య 1218కి పెరిగింది.

భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 37, 346 కు వేలుకు చేరింది. 9054 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో రిక‌వ‌రీ రేటు 25.63 శాతంగా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు చెబుతున్నారు. గ‌త రెండు వారాల నుంచి రిక‌వ‌రీ రేటు 13 శాతంగా ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా 11,506 కేసులు నమోదుకాగా.. 485 మంది మరణించారు. గుజరాత్ లో 4,395 పోసిటివ్ కేసులు నమోదయ్యాయి. 214 మంది మృత్యువాతపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories