మణిపూర్‌ ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

37 People Died in Landslides in Manipur | Live News
x

మణిపూర్‌ ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

Highlights

Manipur: కొండచరియలు విరిగిపడిన ఘటనలో 37 మంది మృతి

Manipur: మణిపూర్‌లో కొండచరియలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మృతుల సంఖ్య 37కు చేరుకుంది. ఆచూకీ లభించని 25 మంది కోసం అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న చోట కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడుస్తుండడంతో మిస్‌ అయిన వారందరూ చనిపోయి ఉంటారని అధికారులు ప్రాథమింకగా నిర్ధారించారు. శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు 37 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో 24 మంది టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది, 13 మంది పౌరులు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఘటనలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 37కు పెరిగింది. ఆచూకీ లభించని 25 మంది కోసం అధికారులు విసృతంగా గాలింపు చేపడుతున్నారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడుస్తుండటంతో మిస్ అయిన వారందరూ చనిపోయి ఉంటారని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. భారీ వర్షాల కారణంగా సహాయకచర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. కాగా.. ఇప్పటివరకు 13 మంది జవాన్లను, ఐదుగురు పౌరులను సహాయక సిబ్బంది రక్షించింది. మరోవైపు.. తుపుల్ రైల్వే యార్డ్ ప్రమాద స్థలానికి సమీపంలోనే మరో చోట కొండచరియ విరిగిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

నాలుగు రోజుల క్రితం మణిపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. 45 మంది గల్లంతయ్యారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ ఆపరేషన్‌ చేపడుతోంది. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ దుర్ఘటన గురించి ఆర్మీ అధికారులు మాట్లాడారు. ఘటన చాలా బాధాకరమని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories