వందల కిలోల ఉల్లిని ఎత్తుకెళ్లిన దొంగలు

వందల కిలోల ఉల్లిని ఎత్తుకెళ్లిన దొంగలు
x
Highlights

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలనంటడంతో ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఉల్లిగడ్డలను బంగారం కంటే ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలనంటడంతో ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఉల్లిగడ్డలను బంగారం కంటే ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు. కాగా, ఉల్లిగడ్డల కోసం దొంగతనాలు కూడా చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లో పంట పొలాల్లో ప్రవేశించి ఉల్లిపాయల్ని ఎత్తుకెళ్తున్నారు. ఇదే తరహాలో తమిళనాడులో కూడా చోటు చేసుకుంది. పెరంబలూర్ జిల్లాలోని కూత్తనూర్ గ్రామం పరిధిలో ఓ రైతు ఉల్లిపంట వేయడానికి తెచ్చుకున్న 350 కిలాల ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్లారు.

తమిళనాడుకు చెందిన ముత్తుక్రిష్ణన్ (40)‎ ఉల్లిపంటలు పండిస్తూ జీవనం గడుపుతున్నారు. ముత్తుకృష్ణన్ తన 350 కిలోల చిన్న ఉల్లిపాయలను తీసుకొచ్చారు. 3ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగుచేయాలని చూశారు. కాగా 15 బుట్టలలో కొన్ని ఉల్లిపాయలు ఉంచి‎ పొలం వద్ద ఉంచాడు. మూడు రోజులగా ‎ వర్షాలు కురుస్తున్నందున ముత్తుకృష్ణన్ పొలం వైపు వెళ్లలేదు.

దీంతో బుధవారం వర్షలు తగ్గడంతో పొలం వెళ్లి చూసిన ముత్తుక్రిష్ణన్ అక్కడ ఉల్లి లేకపోవడంతో ఆందోళన చెందాడు. పొలంలో ఉంచిన 350 కిలోల ఉల్లిని దుండగులు దొంగిలించారని గ్రహించాడు. దీంతో పోలీసులను ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా 350 కిలోల ఉల్లిపాయలు పోవడంతో ముత్తుక్రిష్ణన్ లబోదిబోమంటున్నాడు.

ఏ వంట చేయలాన్న ఉల్లి తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ ఉల్లి ధరలు చూసి ప్రజలు గగ్గొలు పెడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీ రాష్ట్రంలో అయితే ఉల్లిపాయలు కిలో రూ.100 దాటి డబుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నారు. బెంగళూరుసిటీలో అయితే ఏకంగా హోటల్స్ లోని మోనులో నుంచి ఉల్లి దోశలను మాయం చేశారు. బీహార్ లో అయితే రాయితీపై ప్రభుత్వం ఇచ్చే ఉల్లిపాయ కోసం జనం బారులు తీరారు. దీంతో అక్కడ సిబ్బంది తలకి హెల్మెట్లు పెట్టుకొని మరి ఉల్లిపాయలు విక్రయిస్తున్నారు.

ఉల్లిగడ్డలు ఇవ్వడంలో ఏమాత్రం ఆలస్యమైన ప్రజలు దాడులు చేసే అవకాశం ఉందని అందుకే హెల్మెట్లు ధరించి విక్రయిస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం టర్కీ నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేయనుంది. దాదాపు 12వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేయనున్నారు. ఇవి అన్ని రాష్ట్రాలకు అందితే ఉల్లి రేట్లు నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories