లెక్కతప్పిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు రూ.34 వేల జరిమానా!

లెక్కతప్పిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు రూ.34 వేల జరిమానా!
x
Highlights

దేశంలో కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన భారీ జరిమానాలు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇక తాజాగా జార్ఖండ్‌లోని రాంచీలో ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ హెల్మెట్ ధరించలేదని రూ.34 వేలు జరిమానా విధించడం అందరిని షాక్‌కు గురి చేస్తోంది.

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రాణాలను కాపాడుకోండి.. లేకపోతే భారీగా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది.. అంటూ కొత్త మోటార్ వెహికిల్ చట్టం తీసుకోచ్చారు. దేశంలో కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన భారీ జరిమానాలు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇక తాజాగా జార్ఖండ్‌లోని రాంచీలో ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ హెల్మెట్ ధరించలేదని రూ.34 వేలు జరిమానా విధించడం అందరిని షాక్‌కు గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాంచీకి చెందిన రాకేష్ కుమార్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ ట్రాఫిక్ సిబ్బంది చిక్కాడు దీంతో వారు ఏ మాత్రం సోచయించకుండా.. కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం రూ. 34 వేల జరిమానాను విధించారు.

రాకేష్ కుమార్ హెల్మెట్ ధరించకపోవడంతో పాటు.. ఇతర నిబంధనలను కూడా ఉల్లఘించడం వల్లే ఇంత భారీ జరిమానా విధించాల్సి వచ్చిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఓ కానిస్టేబుల్ పరిస్థితే ఇట్లఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అని వాహనదారులు భయపడుతున్నారు. ఇక మరోవైపు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వారికి రెట్టింపు జరిమానా విధించాలని ఢిల్లీ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ మీనూ చౌదరి ఆదేశించిన విషయం తెలిసిందే. మొత్తానికి చట్టం ఎవరికి చుట్టం కాదని నిరుపిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories