Lok Sabha: లోక్‌సభలో మరో 33 మంది ఎంపీల సస్పెన్షన్‌

33 Opposition Members Including Congress Adhir Ranjan Chowdhury Suspended From Lok Sabha
x

Lok Sabha: లోక్‌సభలో మరో 33 మంది ఎంపీల సస్పెన్షన్‌

Highlights

Lok Sabha: ఇవాళ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగడంతో సస్పెండ్ చేసిన స్పీకర్‌

Lok Sabha: పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. పార్లమెంట్ ఘటనపై అమిత్‌షా సమాధానం చెప్పాలంటూ లోక్‌సభలో విపక్షాలు అందోళన చేశాయి. దీంతో లోక్‌సభ నుంచి 33 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్‌ ఓం బిర్లా సస్పెండ్‌ చేశారు. సభలో గందరగోళం సృష్టించినందుకు కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి సహా 33 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ అయ్యారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో అధిర్ రంజన్ చౌదరి, టీఆర్ బాలు, దయా నిధి మారన్ ఉన్నారు. మాణికం ఠాగూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకందన్, బెన్నీ బహనన్, కే సుబ్రమణ్యం, ఎస్ వెంకటేశన్, మహ్మద్ జావేద్ ఉన్నారు.

33 మంది ఎంపీలను శీతాకాల సమావేశాల వరకు సస్పెన్షన్‌ విధించింది. కే జయకుమార్‌, విజయ్‌ వసంత్‌, అబ్దుల్‌ ఖలీక్‌ ముగ్గురు స్పీకర్‌ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో ప్రవేశపెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories