Madhya Pradesh: తల్లిపై ఫిర్యాదు చేసిన మూడేళ్ల చిన్నోడు

Madhya Pradesh: ముద్దుగా చెంపమీద కొట్టిందని కంప్లైట్‌

Rama Rao
Published on: 18 Oct 2022 7:57 PM IST
3-Year-Old Boy Goes to Police Station to Complain Against Mother for Scolding Him in Burhanpur
X

Madhya Pradesh: తల్లిపై ఫిర్యాదు చేసిన మూడేళ్ల చిన్నోడు

Madhya Pradesh: చిన్నారుల మద్దుముద్దు మాటలు.. వారి చేష్టలు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మూడేళ్ల బుడ్డోడు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి.. వాళ్ల అమ్మమీదే ఫిర్యాదు చేశాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌ జిల్లా దేడ్‌ తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల సద్దాం పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. తల్లిపైనే ఫిర్యాదు చేశాడు. ఇంతకు ఆ బుడ్డోడికి తల్లిపై అంత కోపం ఎందుకు వచ్చిందంటే.. రోజు ముద్దుగా చెంపమీద కొడుతోందట. అంతేకాదు.. స్నానం చేయించిన తరువాత.. కాటు పెడుతుందట.

అంతేకాదు.. తన కోసం వాళ్ల నాన్న తెచ్చిన చాక్లెట్లను తన తల్లి దొంగతనం చేస్తుందట.. దీంతో సద్దాంకు కోపం కట్టలు తెంచుకుంది. పోలీసు స్టేషన్‌కు వెళ్దా వస్తావా? రావా? అంటూ తండ్రితో గొడవకు దిగాడు. దీంతో తండ్రి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విషయం చెప్పాడు. అక్కడి ఎస్‌ఐ ప్రియాంక నాయక్‌కు సద్దాం తన ఫిర్యాదును వివరించాడు. మా మమ్మీని జైళ్లో పెట్టండంటూ ఎస్‌ను సద్దాం కోరాడు. ఎస్‌ఐ సద్దాం ఫిర్యాదు రాసుకుని.. సంతకం కూడా తీసుకుంది. కంప్లైంట్‌ తీసుకున్నందుకు ఎస్‌ఐకు సద్దాం నమస్కారం కూడా చేశాడు. బుడ్డోడి చేష్టలకు నెటిజన్లు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.

Rama Rao

Rama Rao

Next Story