logo
జాతీయం

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం

3 Terrorists Encountered by Indian Army Today at Jammu Kashmir | National News
X

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం

Highlights

Jammu Kashmir: చవల్గామ్‌ ప్రాంతంలో ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు...

Jammu Kashmir: జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. చవల్గామ్‌ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు హెచ్‌ఎం షిరాజ్ మోల్వి, యావర్ భట్‌గా గుర్తించారు. వీరితో పాటు మృతుల్లో మరో కమాండర్‌ కూడా ఉన్నట్టు తెలిపారు.

ఇక.. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరికొంత మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తోంది భారత సైన్యం.

Web Title3 Terrorists Encountered by Indian Army Today at Jammu Kashmir | National News
Next Story