logo
జాతీయం

Covid Cases in India: భారత్‌లో కొత్తగా 2.38 లక్షల కొవిడ్ కేసులు

2.38 lakh New Covid Cases in India
X

భారత్‌లో కొత్తగా 2.38 లక్షల కొవిడ్ కేసులు

Highlights

Covid Cases in India: వైరస్ వ్యాప్తి అంచనాకు టెస్ట్‌లు కీలకం.. వెంటనే టెస్ట్‌ ల సంఖ్యపై దృష్టి సారించాలని కేంద్రం లేఖ

Corona Cases in India: ఒమిక్రాన్ వ్యాప్తి విస్తృతంగా ఉన్న సమయంలో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా టెస్ట్ ల సంఖ్య తగ్గడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టుల సంఖ్యను పెంచాలని, మహమ్మారి కట్టడిలో ఇది చాలా కీలకమని తెలిపింది. క్లస్టర్, హాట్‌ స్పాట్‌ల గుర్తింపునకు, కట్టడి ప్రాంతంగా ప్రకటించేందుకు, కాంటాక్టు ట్రేసింగ్‌, క్వారంటైన్‌, ఐసొలేషన్‌ తదితర కట్టడి చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది.

గత రెండు వారాల్లో ఛత్తీ్‌సగఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బస్తర్‌ సహా 4 జిల్లాల్లో 200 మంది పైగా భద్రతా సిబ్బందికి వైరస్‌కు గురయ్యారు. వీరంతా టీకా 2 డోసులు పొందినవారేనని అధికారులు తెలిపారు. కర్ణాటక మాండ్యలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో 107 మంది విద్యార్థులు సహా 125 మందికి కరోనా సోకింది. కాగా, దేశంలో కొవిడ్‌ టీకా తీసుకున్నవారి సంఖ్య 158 కోట్లు దాటింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒమిక్రాన్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని పేర్కొంటున్నారు.

ముంబై, ఢిల్లీ లో వేవ్‌ ఇప్పటికే గరిష్ఠానికి చేరిందని దీని ప్రకారం మార్చి నాటికి దేశంలో తగ్గుముఖం పడుతుందంటున్నారు నిపుణులు. మార్చి-ఏప్రిల్‌లో మరో ఆందోళనకారక వేరియంట్‌ ఉద్భవించకుంటే కరోనా వెనకడుగు ఖాయమని మహారాష్ట్ర కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ శశాంక్‌ జోషి తెలిపారు. కాగా, ముంబైలో థర్డ్‌ వేవ్‌ లో తొలిసారిగా బ్లాక్‌ ఫంగ్‌సతో ఓ రోగి మృతి చెం దాడు. ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కొవిడ్‌ కేసులు కొంతమేర తగ్గాయి. ఒమైక్రాన్‌ వ్యాప్తి తగ్గడం వల్లే ఇలా జరుగుతోందని భావిస్తే తప్పులో కాలేసినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కొవిడ్‌ పరీక్షలను తగ్గించడం వల్లే కేసులు కొంతమేర తగ్గాయన్నారు. 'టెస్ట్‌, ట్రేస్‌, ఐసొలేట్‌, ట్రీట్‌'(టీటీఐటీ) వ్యూహాన్ని మళ్లీ భారత్‌ అనుసరించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్‌ మాజీ డీన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.మెహ్రా సూచించారు.

బుర్జ్‌ ఖలీఫాను మించి 'డోలో' అమ్మకాలు!కొవిడ్‌ వ్యాప్తి మొదలైన తర్వాత 'డోలో 650' మా త్రల అమ్మకాలు అమాంతం పెరిగాయి. 2020 నుంచి ఇప్పటివరకు 350 కోట్లకుపైగా డోలో మాత్రల విక్రయాలు జరిగాయి. ఈ మాత్రలన్నింటిని ఒకదానిపై ఒకటిగా పేర్చితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం 'బుర్జ్‌ ఖలీఫా' కంటే 63,000 రెట్లు పొడవుగా ఏర్పడుతుంది. గత రెండేళ్లలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన జ్వర మాత్రల జాబితాలో డోలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కాల్‌పాల్‌ మాత్రలు ఉండగా, ఆరో స్థానంలో క్రోసిన్‌ ట్యాబ్లెట్లు ఉన్నాయి. కాగా, తీవ్ర కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన పలువురు రోగుల్లో ఆక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ (ఏఆర్‌డీఎస్‌) రుగ్మత తలెత్తుతోంది. అలాంటి వారి చికిత్సకు పనికొస్తుందని భావిస్తున్న 'స్టెమ్‌ ప్యూసెల్‌' ఔషధంతో మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు కర్ణాటకకు చెందిన 'స్టెమ్‌ ప్యూటిక్స్‌' కంపెనీకి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) పచ్చజెండా ఊపింది.

10 రోజుల తర్వాతా పాజిటివ్‌కొవిడ్‌ సోకి ఐసొలేషన్‌లో ఉన్న కొంత మందిలో 10 రోజుల తర్వాత కూడా పాజిటివ్‌ వస్తోందని ఓ పరిశోధనలో తేలింది. ప్రతి పది మందిలో ఒకరికి ఇలా ఉండే అవకాశం ఉందని ఆ అధ్యయనంలో తేలింది. ఎక్సిటర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధన ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలో సరికొత్త టెస్టు ద్వారా పాజిటివ్‌లలో వైరస్‌ ఉనికిని గుర్తించారు.

Web Title2.38 lakh New Coronavirus Cases Reported in India Today 19 January 2022 | Today Corona Cases in India
Next Story