తమిళనాడులో 23 మంది కోవిడ్ రోగుల డిశ్చార్జ్

తమిళనాడులో 23 మంది కోవిడ్ రోగుల డిశ్చార్జ్
x
Highlights

తమిళనాడులో 23 మంది కోవిడ్ -19 రోగులు కోలుకున్నారు. చికిత్స అనంతరం వైరస్ నెగిటివ్ రావడంతో కోయంబత్తూరు జిల్లాలోని ఓ ఆసుపత్రి నుండి వీరు డిశ్చార్జ్ చేశారు.

తమిళనాడులో 23 మంది కోవిడ్ -19 రోగులు కోలుకున్నారు. చికిత్స అనంతరం వైరస్ నెగిటివ్ రావడంతో కోయంబత్తూరు జిల్లాలోని ఓ ఆసుపత్రి నుండి వీరు డిశ్చార్జ్ చేశారు. దీంతో తమిళనాడులో రెండవ అత్యధిక కేసులున్న జిల్లా సరైన దిశలో వెళుతున్నట్లు అర్థమవుతోందని అధికారులు చెబుతున్నారు, ప్రస్తుతం కోయంబత్తూరులో తక్కువ కేసులు నమోదవ్వడమే కాకుండా రోజుకు ఎక్కువ డిశ్చార్జెస్ ఉండటం ఊరట కలిగించే విషయం. కోవిడ్ -19 కేసుల చికిత్స కోసం కోయంబత్తూరులోని ఇఎస్‌ఐ ఆసుపత్రి పూర్తిగా అంకితమైందని కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ కె రాజమణి తెలిపారు.

కోయంబత్తూర్, నీలగిరి, తిరుపూర్, ఈరోడ్ నుండి 250 మంది బాధితులను అక్కడ చేర్చారు. డిశ్చార్జ్ అయిన 23 మంది రోగులలో 10 మంది కోయంబత్తూర్, 9 మంది తిరుపూర్, మరియు నలుగురు నీలగిరికి చెందినవారు ఉన్నారు. మిగిలిన రోగులు త్వరలో డిశ్చార్జ్ అవుతారని ఆశిస్తున్నామని కలెక్టర్ అన్నారు.

డిశ్చార్జ్ అయిన వారు ఇంట్లో నిర్బంధంలో ఉండాలని వారికి సూచించినట్టు చెప్పారు. ఇక గత మూడు రోజుల్లో పరీక్షించిన 2,225 మందిలో కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్ పరీక్షలు జరిగాయని, అందువల్ల స్ప్రెడ్‌ తగ్గే అవకాశం ఉందని జిల్లా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories