ఢిల్లీ ప్రజలు స్థానికత, జాతీయతకు ప్రాధాన్యం ఇచ్చారా?

ఢిల్లీ ప్రజలు స్థానికత, జాతీయతకు ప్రాధాన్యం ఇచ్చారా?
x
Highlights

ఢిల్లీలో నిన్న(మంగళవారం) వెల్లడైన ఫలితాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. ప్రజలు స్థానికతకు జాతీయతకు ప్రాధాన్యం ఇచ్చారని అర్ధమవుతోంది. ఎనిమిది నెలల కిందట...

ఢిల్లీలో నిన్న(మంగళవారం) వెల్లడైన ఫలితాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. ప్రజలు స్థానికతకు జాతీయతకు ప్రాధాన్యం ఇచ్చారని అర్ధమవుతోంది. ఎనిమిది నెలల కిందట లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆప్(ఆమ్ ఆద్మీ) తిరిగి భారీగా పుంజుకుంది. ఇదే క్రమంలో ఏడుకు ఏడు ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 సీట్లు సాధిస్తుందని భావించారు. కానీ అంచనాలు తారుమారు అయ్యాయి. ఆ పార్టీ కేవలం 8 సీట్లకే పరిమితం అయింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు 54.3 శాతం ఓట్లు వచ్చాయి అప్పట్లో 67 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది.

ఈసారి కూడా 53.57 శాతం ఓట్లు వచ్చాయి. గతంతో పోల్చుకుంటే ఇందులో పెద్ద తేడా అంటూ ఏమి లేకపోయినా తన ఓటు శాతాన్ని పదిలంగా నిలుపుకుంది ఆ పార్టీ. అలాగే బీజేపీకి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 32.2 శాతం ఓట్లు వచ్చాయి కానీ అప్పుడు కేవలం మూడు సీట్లకే పరిమితం అయింది బీజేపీ. అయితే ఈసారి ఆ పార్టీకి ఏకంగా 6 శాతం ఓట్లు పెరిగాయి.. అయినా 8 స్థానాలే వచ్చాయి. ఇక వరుసగా రెండో సారి కూడా ఖాతా తెరవలేదు కాంగ్రెస్ పార్టీ.. పైగా 2015 లో వచ్చిన దాదాపు పది శాతం ఓట్లు కూడా ఆ పార్టీ నిలుపుకోలేకపోయింది. గతంలో సాధించిన ఓట్ల శాతం కంటే ఈసారి బీజేపీకి ఎక్కువగా నమోదైన క్రమంలో ఢిల్లీలో ఆప్, బీజేపీ ల మధ్య గట్టి పోటీ జరిగిందన్న విషయం అర్ధమవుతోంది.

బీజేపీ కూడా కొన్ని సీట్లలో తక్కువ ఓట్లతో ఓటమి పాలైంది. అయితే బీజేపీకి పెరిగిన ఓటు శాతం కాంగ్రెస్ నుంచి వచ్చిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీని కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం చేస్తున్నారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో 62 సీట్లు సాధించిన ఆప్ 8 నెలల కిందట జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. ఆ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో 18 శాతం ఓట్లు సాధించింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇప్పుడు కనీసం 5 శాతం ఓట్లు కూడా సాధించిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో 22.46 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. అంటే స్థానికత విషయంలో ఆమ్ ఆద్మీకి జాతీయత విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు ప్రాధాన్యం ఇచ్చారన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories