Bangladesh Train Accident: ఢాకా సమీపంలో రెండు రైళ్లు ఢీ... 20 మంది మృతి, వంద మందికిపైగా గాయాలు

20 killed Several injured in collision between two Trains in Bangladesh
x

Bangladesh Train Accident: ఢాకా సమీపంలో రెండు రైళ్లు ఢీ... 20 మంది మృతి, వంద మందికిపైగా గాయాలు

Highlights

Bangladesh Train Accident: మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అధికారులు

Bangladesh Train Accident: ఇటీవల తరచూ రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో రైళ్లలో ప్రయాణించాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదాన్ని మన దేశంలోని ప్రజలు ఇంకా పూర్తిగా మరిచిపోలేదు. అయితే తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అది మన దేశంలో కాదు.. ఆర్ధిక పరిస్థితితో సతమతం అవుతున్న బంగ్లాదేశ్‌లో. ఆ దేశ రాజధాని ఢాకా సమీపంలో నిన్న సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 20 మంది మరణించారు. అంతేకాకుండా వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. రెండు రైళ్లు పరస్పరం ఢీకొనడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

సోమవారం సాయంత్రం 4.15 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. కిశోర్​గంజ్ నుంచి ఢాకా వైపు వెళ్తున్న రైలును వెనుక నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల రైలుకు సంబంధించి రెండు బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. కోచ్‌ల శిథిలాల కింద కొందరు ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయని అధికారులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories