ముంబైలో ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్

ముంబైలో ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ముంబైలోని దాదర్ శుష్రష హాస్పిటల్ లో 27 సంవత్సరాల, 42 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు నర్సులు శుక్రవారం కోవిడ్ -19 భారిన పడ్డారు. శుక్రవారం వీరి...

ముంబైలోని దాదర్ శుష్రష హాస్పిటల్ లో 27 సంవత్సరాల, 42 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు నర్సులు శుక్రవారం కోవిడ్ -19 భారిన పడ్డారు. శుక్రవారం వీరి రక్తనమూనాలను పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.. అంతేకాదు కొత్త రోగులను చేర్చుకోవడం ఆపాలని అధికారులు ఆసుపత్రిని ఆదేశించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న దాదాపు 28 మంది నర్సులను నిర్బంధించాలని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఆసుపత్రిని కోరింది. దీంతో కొత్త రోగులను నిలిపివేయాలని నిర్ణయించింది.

సరైన పరీక్షల తర్వాత ఉన్న రోగులందరినీ డిశ్చార్జ్ చేయడానికి ఆసుపత్రికి 48 గంటల సమయం ఇచ్చింది. దాదర్ అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ కిరణ్ దిఘవ్కర్ మాట్లాడుతూ, "నర్సులందరికీ వారి స్వంత ఖర్చుతో పరీక్షలు నిర్వహించాలని మేము ఆసుపత్రికి సలహా ఇచ్చాము, ఆ తరువాత మేము కాల్ చేస్తాము." అని అన్నారు. మరో సంఘటనలో, దాదర్‌లోని ఎన్‌సి కెల్కర్ రోడ్‌లో శుక్రవారం 83 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ పరీక్షలు చేశారు. దీంతో దాదర్ లో ఇప్పటివరకు ఆరు కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories