మైనర్ బాలికపై ఏడుగురు కలిసి అఘాయిత్యం

మైనర్ బాలికపై ఏడుగురు కలిసి అఘాయిత్యం
x
Highlights

మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ఏడుగురు మృగాళ్లు కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 18 ఏళ్ల బాలిక తన సోదరుడితో కలిసి మధ్యప్రదేశ్‌లోని తన...

మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ఏడుగురు మృగాళ్లు కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 18 ఏళ్ల బాలిక తన సోదరుడితో కలిసి మధ్యప్రదేశ్‌లోని తన గ్రామానికి తిరిగి వెళుతుండగా ముగ్గురు మైనర్లతో సహా ఏడుగురు వ్యక్తులు అఘాయిత్యం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 29-30 మధ్య ఏడుగురు నిందితులు మోటర్‌బైక్‌ను అడ్డగించి, రాత్రి 8.30 గంటల సమయంలో బాలిక సోదరుడిని బావిలో విసిరారు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే వారి చెరనుంచి విడిపించుకొని మహిళ తన సోదరుడిని రక్షించి ఉదయం గ్రామానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులలో ఇద్దరు శుభం బేలే (22), సందీప్ ఖాటియా (23), ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిగతా ఇద్దరు నిందితులను లోకేష్ సోని (22), పవన్ బేలే (24) గా గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితులపై ఐపిసి సెక్షన్ 376, 365 (కిడ్నాప్), 307 (హత్యాయత్నం) కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు మైనర్లతో సహా ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఇద్దరు పరారీలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories