గుజరాత్‌లో కల్తీమద్యం సేవించిన 16 మంది మృత్యువాత

16 Die After Consuming Adulterated Alcohol  in Gujarat
x

గుజరాత్‌లో కల్తీమద్యం సేవించిన 16 మంది మృత్యువాత

Highlights

Gujarat: బొటాడ్ జిల్లా దండూక, బర్వాల పరిసరాల్లో కల్తీ మద్యం బాధితులు

Gujarat: గుజరాత్‌లో కల్తీ మద్యం 16 మందిని బలిగొంది. కల్తీ మద్యం సేవించిన కొందరు అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, దండూక, బర్వాల పరిసరాల్లోంచి బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతూ వేర్వేరు ఆస్పత్రుల్లో 16 మంది మృత్యువాతపడ్డారు. బర్వాల తాలూకా బోటాడ్‌ గ్రామానికి చెందిన కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.

డండూక ప్రాంత పరిసరాల్లోనూ లిక్కర్ సేవించినవారు అస్వస్థతకు గురికావడంతో చికిత్సకోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. నాటుసారా, చీపు లిక్కరు సేవించి అనారోగ్యానికి గురయ్యారని అధికారుల విచారణలో తేలింది. దండూక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పవర్గాలు తెలిపాయి.

చీపులిక్కర్ సేవించి మృత్యువాత పడ్డారని డాక్టర్ల నివేదిక ఆధారంగా శాంపిళ్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని భావనగర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ అశోక్‌ యాదవ్ తెలిపారు. బర్వాలా పోలీస్‌స్టేషన్‌ పరిసరాల్లోని కల్తీమద్యం సేవించిన గ్రామాల్లో, వైద్యాధికారులు, పోలీసులు అధికారులు పర్యటించారు. సారా బాధిత కుటుంబాలను విచారించి వివరాలను నమోదు చేశారు. నాటుసారా స్థావరాలపై పోలీసులు అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories