క్రూయిజ్ షిప్ లో చిక్కుకున్న138 మంది భారతీయులను ఖాళీ చేయలేము : కేంద్ర ప్రభుత్వం

క్రూయిజ్ షిప్ లో చిక్కుకున్న138 మంది భారతీయులను ఖాళీ చేయలేము : కేంద్ర ప్రభుత్వం
x
Highlights

టోక్యో తీరంలో కొరోనావైరస్ కారణంగా క్రూయిజ్ షిప్ లో చిక్కుకున్న భారతీయులను ప్రస్తుతానికి ఖాళీ చేయలేమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్...

టోక్యో తీరంలో కొరోనావైరస్ కారణంగా క్రూయిజ్ షిప్ లో చిక్కుకున్న భారతీయులను ప్రస్తుతానికి ఖాళీ చేయలేమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. భారతదేశం మరియు విదేశాలలో కరోనావైరస్ పరిస్థితి మరియు పర్యవేక్షణపై విలేకరుల సమావేశంలో ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గురువారం మాట్లాడుతూ, క్రూయిజ్ షిప్‌లో ఉన్న భారతీయులను ప్రస్తుతానికి తరలించలేమని, వ్యాప్తి చెందకుండా నిరోధించాలనే ఉద్ధ్యేశంతో అక్కడి అధికారులు వారిని నిర్బంధించారని.. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని అన్నారు.

"జపాన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలు ఓడలో నిర్బంధించబడ్డారు. పాజిటివ్ కేసులను కనుగొన్న వ్యక్తులను జపాన్ అధికారులు ఆసుపత్రిలో చేర్చారు. మిగిలిన వారు ఫిబ్రవరి 19 వరకు నిర్బంధంలోనే ఉంటారు. ఈ క్రమంలో మనవాళ్లను మాత్రమే తరలించమని మేము వారికి చెప్పలేము"అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. మరోవైపు "మా రాయబార కార్యాలయం -ఇండియన్ ఎంబసి టోక్యో జపాన్లోని యోకోహామాకు దూరంగా ఉన్న డైమండ్ ప్రిన్సెస్ యొక్క సిబ్బంది మరియు ప్రయాణీకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది, అవసరమైన అన్ని సహాయాలు మరియు సహాయాలను అందిస్తోంది. ప్రయాణీకులు మరియు సిబ్బంది ప్రస్తుతం జపాన్ అధికారులచే నిర్బంధించబడ్డారు" అని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కాగా జపాన్ క్రూయిజ్ షిప్‌లో మొత్తం 3,711 మంది ఉన్నారు, వారిలో 138 మంది భారతీయులు కూడా ఉన్నారు. దాదాపు 60 మందికి పైగా వైరస్ సోకినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే 20 రోజులకు పైగా ఆ షిప్ లో ఉన్న వారందరు నిర్బంధంలో ఉన్నారు. వారికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన మందులను సకాలంలో అందిస్తున్నారు. మరోవైపు షిప్ లో ఉన్న వారికి ఆహార పదార్ధాల్లో కూడా మార్పు చేశారు. రెగ్యులర్ గా వారు తినే ఆహరం కాకుండా లైట్ ఫుడ్.. వాంతులు విరేచనాలు అవకాశం లేని ఆహార పదార్ధాలను మాత్రమే వారికి అందజేస్తున్నారు. షిప్ లో దాదాపు 10 వేల మాస్కులను ఉంచినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories