దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

12,847 New Coronavirus Case Reported in India Today June 17
x

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

Highlights

*కొత్తగా 12,847 మందికి పాజిటివ్, 14 మంది మృతి

Coronavirus: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పుంజుకున్నాయి. నిన్నటి కంటే ఇవాళ ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం 24గంటల్లో దేశంలో 12వేల 847 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.32 కోట్లకు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63వేల 63 కు చేరింది. ఇక కరోనా పాజిటివిటి రేటు 2.47 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కరోనాతో 14 మంది మరణించారు. 24గంటల్లో 7వేల 985 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories