వైరల్ వీడియో ; ఆమ్మో! 12 ఏళ్లుగా కంట్లో ఏలికపాము

వైరల్ వీడియో ; ఆమ్మో! 12 ఏళ్లుగా కంట్లో ఏలికపాము
x
Highlights

కంట్లో ఏ చిన్నపాటి గాయమైనా అల్లడిపోతాం.అలాంటిది గుజరాత్‌కు చెందిన జాసుభాయ్ పటేల్ తన కంట్లో 12 ఏళ్లుగా ఓ ఏలికపాము పెట్టుకున్నాడు.

ఇటీవలె చైనాకి చెందిన ఓ వ్యక్తి చెవిలో బొద్దింక ఏకంగా 10 పిల్లలు పెట్టిన వార్త మనం చూశాం. అలాంటి ఘటనే మరోకటి గుజరాత్‌లో చోటుచేసుకుంది. కంట్లో ఏ చిన్నపాటి గాయమైనా అల్లడిపోతాం. గుజరాత్‌కు చెందిన జాసుభాయ్ పటేల్ తన కంట్లో 12 ఏళ్లుగా ఓ ఏలికపామును పెట్టుకున్నాడు. అసలు ఏలిక పాము కంట్లో తిష్ట వేసి ఎందుకు ఉంది. అనే కదా మీ డౌట్ అసలు వివరాల్లోకి వెళ్థాం.

గుజరాత్‌కు చెందిన డెబ్బై ఏళ్ల జాసుభాయ్ పటేల్ కొన్ని సంవత్సరాలుగా కంటి నొప్పితో బాధపడుతున్నాడు. స్థానిక వైద్యల చుట్టూ తిరిగాడు. అయినా కంటి నొప్పి తగ్గలేదు. దీంతో ఆయన ఒకరి సలహా మేరకు భరూచ్‌లోని నారాయణ్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్ మిలన్ పాంచాల్‌ను సంప్రదించి తన సమస్య గురించి చెప్పాడు. జాసుభాయ్ సమస్యను తెలుసుకున్న డాక్టర్ మిలన్ మైక్రోస్కోపిక్ పరికరంతో పటేల్ కంటిని పరిశీలించాడు. ఆయన కంట్లో తెల్ల గుడ్డు వెనుక చిన్నకదలిక కనిపించింది. దీంతో క్షుణ్ణంగా పరిశీలించిన డాక్టర్ విలన్ ఏలికపాము ఉన్నట్లు గుర్తిచారు. మైక్రోస్కాపిక్ సర్జరీతో దానిని తొలిగించాలని జాసుభాయ్ పటేల్ చెప్పాడు.

అనంతనం జాసుభాయ్ పటేల్ సర్జరీ ఓప్పుకున్నాడు. డాక్టర్ మిలన్ అర్ధగంట పాటు శ్రమించి సర్జరీ చేసి అనంతరం పటేల్ కంట్లోంచి 7 సె.మీ పొడవు, తెల్లటి ఆకారంలో ఉన్న ఏలిక పామును బయటకు తీశారు. ఆ ఏలికపామును తొలగించకపోయి ఉంటే కంటి చూపుకే ప్రమాదమని తెలిపారు. రక్తప్రవాహంలో కలిసి కంటి నుంచి మెదడుకు చేరుకొనే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం కంటి చూపు బాగానే ఉన్నట్టు పటేల్ చెప్పారు.

ఏలికపాము 12 ఏళ్లుగా జాసుభాయ్ పటేల్ కంట్లోనే ఉంది. ఇది ఏలా సాధ్యమైందంటే జాసుభాయ్ పటేల్‌ను పన్నెండెళ్ల క్రితం కుక్క కరిచింది. కుక్క కరవడంతో గాయం ద్వారా పరాన్న జీవి రక్తంలో కలిసి కంటికి చేరుకుని ఉండొచ్చని వైద్యులు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories