ముంబైలో జరిగిన మారణహోమానికి 11 ఏళ్లు

Mumbai
x
Mumbai
Highlights

ఈ సంఘటనని గుర్తుచేసుకుంటూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. "2008లో ముంబై ఉగ్రవాద దాడి

దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలో 2008 నవంబరు 26న ఉగ్రమూకలు మారణ హోమాన్ని సృష్టంచిన ఘటనని ఏ ఒక్క భారతీయుడు కూడా తన జీవితంలో మరిచిపోలేడు. ఈ ఘటన జరిగి నేటికి పదకొండేళ్ళు అవుతుంది. లష్కరే తోయిబాకి చెందిన 10మంది తీవ్రవాదులు శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌పై దాడులకి దిగారు, ఆ దాడులలో మొత్తం 166మంది చనిపోగా మరో 300 మంది క్షతగాత్రులు అయ్యారు. ఇందులో తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారు మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే.. ఈ దాడికి కారకులు అయిన వారిలో ముఖ్యుడైనా అజ్మల్ కసబ్ ని 2012 లో భారత్ ఉరితీసింది.

ఈ సంఘటనని గుర్తుచేసుకుంటూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. "2008లో ముంబై ఉగ్రవాద దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సందర్భంగా దేశాన్ని కాపాడటంలో ప్రాణత్యాగం చేసిన భద్రతా బలగాలకు నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు" అంటూ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories