త్రిపురలో అధికారపార్టీలో ముసలం..11 మంది ఎమ్మెల్యేలు..

త్రిపురలో అధికారపార్టీలో ముసలం..11 మంది ఎమ్మెల్యేలు..
x
Highlights

త్రిపుర అధికార పార్టీలో ముసలం ఏర్పడింది. ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ పై 11 మంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా..

త్రిపుర అధికార పార్టీలో ముసలం ఏర్పడింది. ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ పై 11 మంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్ర నాయకత్వాన్ని కలవడానికి 11 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఢిల్లీలో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలతో ఉన్నారని.. సహచర మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, సీనియర్లను సీఎం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసంతృప్తి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు, ఈ విషయంపై చర్చించడానికి బిజెపి అగ్ర నాయకులు.. అమిత్ షా, జెపి నడ్డా, పార్టీ త్రిపుర ఇంచార్జిని కలవాలని అసంతృప్తి ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో ఢిల్లీలోనే మకాం వేశారు. ఢిల్లీలో క్యాంపింగ్ చేస్తున్న వారిలో సుశాంత చౌదరి, పరిమల్ దేబ్ బార్మా, డిసి రాంఖ్వాల్, ఆశిష్ దాస్, అతుల్ దేబ్ బార్మా, బర్బ్ మోహన్ త్రిపుర, రామ్ ప్రసాద్ పాల్ ఉన్నారు. ముఖ్యమంత్రి బిప్లాబ్‌కు వ్యతిరేకంగా బయటకు రావడానికి 25 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ పాల్ పేర్కొన్నారు. సీఎం వ్యవహార శైలిపై ఫిర్యాదు చేయడానికి రాంప్రసాద్ లాల్ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోశ్‌తో భేటీ అయ్యారు. మరోవైపు తమ కోపమంతా సీఎంపైనేనని, పార్టీపై గాని, అధిష్ఠానంపై గానీ తమకు ఎలాంటి అసంతృప్తీ లేదని అసంతృప్తి ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories