Water Commission: వామ్మో.. 11 నదీ ప్రాంతాలు డేంజర్‌‌లో ఉన్నాయా? మరి నెక్ట్స్ ఏంటి?

Water Commission
x

Water Commission: వామ్మో.. 11 నదీ ప్రాంతాలు డేంజర్‌‌లో ఉన్నాయా? మరి నెక్ట్స్ ఏంటి?

Highlights

Water Commission: దేశవ్యాప్తంగా కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, చెరువులు, ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. దీంతో నీటి మట్టం పెరిగిపోతుంది. మరికొన్ని చోట్ల 11 నదీ ప్రవాహాలు ప్రమాదరకంగా ఉన్నాయని వాటర్ కమిషన్ ఒక నివేదకలో వెల్లడించింది.

Water Commission: దేశవ్యాప్తంగా కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, చెరువులు, ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. దీంతో నీటి మట్టం పెరిగిపోతుంది. మరికొన్ని చోట్ల 11 నదీ ప్రవాహాలు ప్రమాదరకంగా ఉన్నాయని వాటర్ కమిషన్ ఒక నివేదకలో వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

దాదాపు 11 నదీ ప్రవాహాలు ప్రమాదకరంగా మారి ఉన్నాయని వాటర్ కమిషన్‌ విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడైంది. అస్సాం, బీహార్, తమిళనాడు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌లోని 12 ప్రదేశాలలో సాధారణం కంటే ఎక్కువ వరద ముంపు పరిస్థితులు ఉన్నట్‌లు వాటర్ కమిషన్ వెల్లడించింది.

అస్సాంలోని కరీంగంజ్‌లో ఉన్న కుషియారా నది , జోర్హాట్‌లోని నీమతిఘాట్ దగ్గర బ్రహ్మపుత్ర నది ఆందోళనకరంగా మారింది. నీటి మట్టం చాలా పెరిగిపోయి భయాందోళనకు గురిచేస్తుదని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. అదేవిధంగా బీహార్‌‌ బాల్లారా వద్ద కోసి, బెనిబాద్ వద్ద బాగ్మతి, దుమారియాఘాట్ వద్ద గండక్‌లో నీటి మట్టాలు తీవ్ర స్థాయిలోకి పెరిగినట్లు నివేదిక చెబుతుంది.

వీటితో పాటు, ఉత్తర ప్రదేశ్‌లో ఫతేఘర్, కచ్లా వంతెన వద్ద గంగా , ఎల్గిన్ బ్రిడ్జ్ ఘాగ్రా, ఖడ్డా వద్ద గండక్ నదులు హెచ్చరికలు స్థాయిలను దాటినట్లు తెలుస్తోంది. అలాగే ఒడిసాలోని మథాని రోడ్ బ్రిడ్జ్, సుబర్ణ రేఖలోని రాజ్ ఘట్ వద్ద సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నీటి మట్టాలు నమోదయ్యాయి. తమిళనాడులో కావేరి నదిపై ముసిరి వద్ద నీటి మట్టం అమాంతం పెరిగిపోయి భయాన్ని కలిగిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌తో పాటు మరో 10 రాష్ట్రాల్లోని 23 ప్రదేశాలకు జలకమిషన్ ఇన్ ఫ్లో అంచనాలను జారీ చేసినట్లు నివేదిక వెల్లడించింఆది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రతో సహా పలు జలాశయాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని సురక్షిత ప్రాంతాలకు తరలివెళితే మంచిదని చెబుతున్నారు. అయితే ఏ నదీ ప్రవాహం మరింత ప్రమాదకరంగా మారిందో దానికి సంబంధించిన వివరాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తామని కూడా వాటర్ కమిషన్ చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories