వైద్యానికి సహకరించని చిన్నారి ... తల్లి ఆలోచనకి డాకర్లు ఫిదా

వైద్యానికి సహకరించని  చిన్నారి ... తల్లి ఆలోచనకి డాకర్లు ఫిదా
x
Highlights

అ చిన్నారి వైద్యానికి సహరికరించక పోవడం , పైగా ఏడవడం మొదలు పెట్టింది.. దీనితో ఆమె భాదను ఇటు వైద్యులు అటు అ చిన్నారి తల్లితండ్రులు చూడలేకపోయారు .

సహజంగానే చిన్నపిల్లలకి దెబ్బలు తగిలితే మామలుగా ఏడవరు .. అ దెబ్బలకి వైద్యం చేస్తే కూడా అంతా ఈజీగా సహకరించరు. ఇలాగే ఢిల్లీలోని జిక్రా అనే 11 నెలల చిన్నారి కాలు విరిగి అవస్థ పడుతుంది . అయితే అ చిన్నారికి ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం ఆమె తల్లితండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు . కానీ అ చిన్నారి వైద్యానికి సహరికరించక పోవడం , పైగా ఏడవడం మొదలు పెట్టింది.. దీనితో ఆమె భాదను ఇటు వైద్యులు అటు అ చిన్నారి తల్లితండ్రులు చూడలేకపోయారు . ఇలాంటి టైంలో అ చిన్నారి తల్లికి ఓ ఐడియా వచ్చి డాక్టర్స్ కి చెప్పింది .

దీనికి ముందు వారు నో చెప్పగా తర్వాత ఒకే చెప్పి అ పాపకి ట్రీట్మెంట్ చేసారు . ఇది వర్కౌట్ కావడంతో అ తల్లి ఇచ్చిన ఐడియాకి డాక్టర్లు ఫిదా అయ్యారు. ఇంతకి అ తల్లి ఇచ్చిన ఐడియా ఏంటంటే అ 11 ఏళ్ల చిన్నారికి ఓ బొమ్మ అంటే ఇష్టం .. అ బొమ్మని జిక్రా పక్క బెడ్ పైన పెట్టి వైద్యం చేస్తున్నట్లు ముందుగా అ చిన్నారిని నమ్మించారు వైద్యులు .. అ బొమ్మ కాలుకి బ్యాండేజి కట్టి అ బొమ్మ రెండు కాళ్ళను పైకి కట్టారు . ఇదంతా ఓ గేమ్ లాగా భావించిన అ చిన్నారి అ తర్వాత ఎలాంటి అల్లరి చేయకుండా వైద్యానికి సహరించింది . ప్రస్తుతం అ చిన్నారి ఆరోగ్యం మెరుగుపడిందని త్వరలో డిశ్చార్జ్ కూడా చేయొచ్చునని వైద్యులు చెప్పారు. ఎంతైనా తల్లిబిడ్డలకు సంబంధించిన బంధం మరొకటి ఉండదుగా..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories