ప్రధాని మోడీ మన్‌కీ బాత్‌ 100 వ ఎపిసోడ్‌ ప్రసారం

100th Episode Of PM Modi Radio Address Mann Ki Baat
x

ప్రధాని మోడీ మన్‌కీ బాత్‌ 100 వ ఎపిసోడ్‌ ప్రసారం

Highlights

Modi: ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల లైవ్‌ టెలికాస్ట్‌

Modi: ప్రధాని ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ రేడియో ప్రోగ్రామ్‌.. ప్రజా ఉద్యమంగా మారిందన్నారు మోడీ. నేడు జరిగిన మన్‌కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ మరో మైలురాయిని అందుకుంది. మన్ కీ బాత్.. వందో ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ ప్రసంగించారు. రేడియో ద్వారా ప్రజలతో పంచుకునే మాటలను... ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం సహా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల లైవ్‌ టెలికాస్ట్‌ నిర్వహించారు.

మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ 2014లో దసరా రోజు ప్రారంభమైన మన్‌కీ బాత్‌ దేశ ప్రజాల ఆదరణ చూరగొనడం ఆనందంగా ఉందన్నారు. మన్‌కీ బాత్‌ కేవలం నా మనసులోని మాటనే కాదు.. కోట్లాది మంది భారతీయుల భావ ప్రకటనే మన్‌కీ బాత్‌ అన్నారు. మన్‌కీ బాత్‌ ఎంత వరకు వెళ్లిందంటే ప్రతి నెల ఆఖరి ఆదివారం ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూసే పరిస్తితి ఏర్పడింది. ప్రతి ఎపిసోడ్‌ చాలా ముఖ్యమయ్యింది అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories