బ్యాంకింగ్ రంగంలో భారీ విలీనాలు..ఇకపై 12 మాత్రమే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు

బ్యాంకింగ్ రంగంలో భారీ విలీనాలు..ఇకపై 12 మాత్రమే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు
x
Highlights

బ్యాంకింగ్ రంగంలో భారీ విలీనాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. 27 బ్యాంకుల్లో పలు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఇకపై 12 మాత్రమే పబ్లిక్ సెక్టార్...

బ్యాంకింగ్ రంగంలో భారీ విలీనాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. 27 బ్యాంకుల్లో పలు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఇకపై 12 మాత్రమే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండనున్నాయి. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయనున్నారు. ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు ఒకే బ్యాంకుగా విలీనం చేస్తున్నారు. పంజాబ్, ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ లు కలిపి ఒకేటే బ్యాంక్ గా రూపాంతరం చెద్దనున్నాయి. ఇండియన్ బ్యాంక్, అలహదా‌బాద్ బ్యాంక్ లను విలీనం చేయడంతో పాటు కెనరా, సిండికేట్ బ్యాంక్ లను కూడా విలీనం చేస్తున్నారు.

బ్యాంకింగ్ రంగంలో సంస్కరణ కొనసాగుతాయన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. 18 ప్రభుత్వ బ్యాంకుల్లో 14 బ్యాంకులు లాభాల్లో ఉన్నాయని చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీని మరింత విస్తృతంగా వాడనున్నామని తెలిపారు. నీరవ్ మోడీ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories