logo

జీన్స్, స్లీవ్‌లెస్‌తో వస్తే డ్రైవింగ్ టెస్టుకు నో !

జీన్స్, స్లీవ్‌లెస్‌తో వస్తే డ్రైవింగ్ టెస్టుకు నో !
Highlights

వాహనదారులకు కొత్తగా వచ్చిన మోటారు చట్టంలోని నిబంధనలు చుక్కలు చూపిస్తుటే..డ్రైవింగ్ టెస్టుకు జీన్స్, స్లీవ్‌లెస్, టాప్ ధరించి వెళ్లకుడుదని తమిళనాడులోని ఓ ఆర్టీఓ అధికారి ఒకరు కొత్త నిబంధన పెట్టారు.

వాహనదారులకు కొత్తగా వచ్చిన మోటారు చట్టంలోని నిబంధనలు చుక్కలు చూపిస్తుంటే..డ్రైవింగ్ టెస్టుకు జీన్స్, స్లీవ్‌లెస్, టాప్ ధరించి రాకుడుదని తమిళనాడులోని ఓ ఆర్టీఓ అధికారి ఒకరు కొత్త నిబంధన పెట్టారు. సరైనా దుస్తులు వేసుకుని వస్తేనే వాహన డ్రైవింగ్ టెస్టు పెడతామని ఆదేశించారు.

చెన్నెలోని ఆర్టీఓ కార్యాలయంలోని డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష కోసం వెళ్ళిన వారికి అక్కడి అధికారుల నుంచి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ కురచ దుస్తువులు వేసుని డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష కోసం వెళ్లింది. అయితే అధికారులు ఆమెను సరైనా దుస్తువులు వేసుకొని వస్తేనే టెస్టు నిర్వహిస్తామని వెనక్కి పంపారు. ఇక మరో మహిళ జీన్స్, స్లీవ్ లెస్ వేసుని వెళ్లింది. ఆమెను కూడా తిప్పి పంపించారు. మహిళలనే కాదు లుంగీతో, చొక్కతో వచ్చిన ఓ వ్యక్తిని కూడా టెస్టుకు నిరాకరించారు.

సరైన దుస్తువులు వేసుకుని టెస్ట్ కు వస్తేనే అనుమతి ఇస్తామని, లేదంటే వెనక్కి పంపిస్తామని ఆర్టీఓ అధికారులు తెలిపారు. గతంలోనూ కేకే నగర్ ఆర్టీవో కార్యాలయం మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇదేంటని అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వకార్యాలయమని ఇక్కడికి వచ్చే వారిని సరైన బట్టలు వేసుకురావాలని కోరితే తప్పేముందని ప్రశ్నింస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top