వామ్మో.. నాలుగు తులాల నగలు మింగింది.. ఎక్కడో తెలుసా?

వామ్మో.. నాలుగు తులాల నగలు మింగింది.. ఎక్కడో తెలుసా?
x
Highlights

రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంలో ఎనుగు పేడ కోసం కోటా శ్రీనివాసరావు ఎదురు చూసినట్లు ఓ కుటుంబమైతే ఆంబోతును పేడ కోసం రాత్రి పగలు ఎదురు చూస్తోంది.

ఎక్కడైనా ఆంబోతు ఊరిమేదకు వదలిపెడతారు. కానీ ఓ ఆంబోతు మాత్రం ఊరిలో తిరిగే పని లేకుండా దర్జాగా మహారాజు వైభవం అనుభవిస్తుంది. రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంలో ఎనుగు పేడ కోసం కోటా శ్రీనివాసరావు ఎదురు చూసినట్లుగా, ఓ కుటుంబమైతే గుమ్మం ముందు ఆంబోతును కట్టి దాని పేడ కోసం రాత్రి పగలు ఎదురు చూస్తోంది. ఆ కుంటుంబం దాని పేడ కోసం ఎందుకు ఎదురు చూస్తోందని అనే కదా మీ డౌటూ.. అది మింగిన నగల కోసం. వినటానికి అశ్చర్యంగా ఉన్న ఈ ఘటన హర్యానాలో చోటుచేసుంది.

హరియాణాలోని సిర్సా జిల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి జనక్ రాజ్ భార్య, కోడలు అక్టోబర్ 19న ఓ వివాహనికి వెళ్లి వచ్చారు. వారు ధరించిన నాలుగు తులాల బంగారు నగలు పొరపాటున కుళ్లిపోయిన కురగాయల బుట్టలో ఉంచారు. ఆ ఇంట్లో వారు మరుసటి రోజు ఆ బుట్టను బయట పడేశారు. కొన్ని గంటల తర్వాత పెళ్ళికి వెళ్లోచ్చిన నగలు ఆ బుట్టలో వేసినట్టు గుర్తుకు వచ్చింది. దీంతో కంగారు పడ్డారు. వారు విసిరిన నగల్లో ఓ చివి పోగు మాత్రమే మిగిలి ఉంది. బుట్టలో కూరగాయలు లేవు. నలుగు తులాల నగలు మాయం అయ్యాయి.

దీంతో ఆభరణాలు ఎవరు తీశారో తెలుసుకునేందుకు వారి ఇంటి బయట ఉన్నసీసీ కెమెరాలోని రికార్డైయిన దృశ్యాలు పరిశీలించారు. దీంతో ఒక్క సారిగా షాక్ కు గురైయ్యారు. కుళ్లీన కూరగాయలతోపాటు నగలు కూడా ఆంబోతు మింగింది. దీంతో పరుగులు తీసిన వారు ఆ ఆంబోతు ఎక్కడఉందో వెతికి ఇంటికి తీసుకొచ్చారు. అంతే కాకుండా దానికి ఓ జల్లెడ పట్టి పేడ వేయగానే నగలు కోసం వెతకడం మొదలు పెడుతున్నార. ఎద్దుకు మాత్రం మంచి ఆహారం పెడుతున్నారు. జనక్ కుటుంబం వెటర్నరీ వైద్యులను సంప్రదించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో వారు నిరాశ చెందారు. రోజు దానికి తిండి పెడుతూ ఆది పెడ వేయగానే పేడను పరిశీలిస్తున్నారు. ఈ మద్యనే ఎద్దును చూసుకోవడానికి మనిషిని కూడా పెట్టారు. అయితే వీరి తిప్పలు చూసి గ్రామస్థులు నవ్వుకుంటున్నారు. వారి నిర్లక్ష్యాన్ని తిట్టుకుంటూ దాని పేడ కోసం ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories