logo
జాతీయం

ఇవాళ మధురైలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

ఇవాళ మధురైలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
X
Highlights

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాల సీఎంలను...

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాల సీఎంలను కలిసి చర్చిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ మధురైలో పర్యటించనున్నారు. ఇప్పటికే దక్షిణాది సీఎంలతో సమావేశాలు జరిపిన కేసీఆర్ త్వరలో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ సమావేశం కానున్నారు. ఈ నెల 23 ఫలితాల తర్వాత కేంద్రంలో మూడో కూటమికే అధికారం దక్కే అవకాశం ఉందనే ఆలోచనలో ఉన్న ఆయన..గుణాత్మక మార్పుకోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కేరళ సీఎం విజయన్‌తోనూ ఫ్రంట్‌పై కేసీఆర్ చర్చించారు. కాగా బుధవారం కన్యాకుమారిలో పర్యటించిన ఆయన నిన్న రామేశ్వరం వెళ్లారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి దగ్గర నివాళులర్పించారు.

Next Story