అతడో వెరైటీ దొంగ.. కారు కనబడితే ఖతమే...

అతడో వెరైటీ దొంగ.. కారు కనబడితే ఖతమే...
x
Highlights

అతడో కీలాడీ దొంగ.. అతడు ఇప్పటి వరకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకుపైగానే కార్లను కొట్టేశాడు. అయితే ఇప్పటి వరకే బాగానే ఉంది కానీ.. ఎవరి వలలో పడద్దో ఆ...

అతడో కీలాడీ దొంగ.. అతడు ఇప్పటి వరకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకుపైగానే కార్లను కొట్టేశాడు. అయితే ఇప్పటి వరకే బాగానే ఉంది కానీ.. ఎవరి వలలో పడద్దో ఆ వలలోనే చిక్కాడంతో.. ఇతగాడి బాగోతం బట్టబయలైంది. ఈ ఘటన దేశ రాజధానికి దిల్లీలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే జూలై 22 తేదీన రాత్రివేళలో దిల్లీ పోలీసులు కల్కాజీ ఆలయం - చిరాగ్ దిల్లీ ప్రాంత్రంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎదురుగా వస్తున్న ఓ కారుని ఆపారు. కారు నుండి కిందకు దిగిన డ్రైవర్‌ను కారుకు సంబంధించిన ఆధారాలు చూపేట్టాల్సింగా కోరారు. దానికి ఆ వ్యక్తికి సమాధానం చెప్పలేక కంగారు పడ్డాడు. పారిపోయే ప్రయత్నమే చేశాడు..కానీ అంతలోనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆ వ్యక్తిని సరిగ్గా పోలీస్ స్టైల్‌లో ప్రశ్నల వర్షం కురిపించే సరికి ఆ వ్యక్తి అసలు ముచ్చట బయట పెట్టాడు. దీంతో ఆ వ్యక్తి చెప్పిన మాటల విని పోలీసులు కంగుతిన్నారు.

పోలీసులు చేపట్టిన విచారణలో ఇప్పటి వరకు తాను 100కి పైగానే కార్లు దొంగిలించునట్లు వెల్లడించాడు. కాగా నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌ల్‌లోని మీటర్‌కు చెందిన జహీద్(40)గా పోలీసులు గుర్తించారు. అతడు దిల్లీలోని ప్రాంతాల్లో ఇంటి బయట పార్క్ చేసి ఉన్న కార్లను దొంగతనం చేసి వాటిని మీరట్, ఘర్ ముక్తేశ్వర్ తదితర ప్రాంతాల్లో అమ్మేస్తున్నాడని తెలిపారు. అయితే దొంగతం కేసులో గత 2005లో మొదటిసారి జైలులోకి ఎంట్రీ ఇచ్చిన జహీద్ మాత్రం మళ్లీ దొంగతనాలు మాత్రం మానలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా అంతేకాదు ఈ హీరో ఏకంగా అతడు 'అన్న గ్యాంగ్' పేరుతో ముఠాగా ఏర్పడి కార్ల దొంగతాననికి పాల్పడుతున్నాడని, ముఠా సభ్యులందరూ అతడిని "అన్నా" అని పిలుస్తారని దిల్లీ ఆగ్నేయ డిప్యూటీ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు. అతడి నుంచి 11కార్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories