మూడోసారి సీఎంగా బాధ్యతలు చేప్పట్టిన కేజ్రీవాల్‌ ...

మూడోసారి సీఎంగా బాధ్యతలు చేప్పట్టిన కేజ్రీవాల్‌ ...
x
Highlights

ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. కేజ్రీవాల్‌తో పాటు మంత్రులుగా ప్రమాణం...

ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. కేజ్రీవాల్‌తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన మనీశ్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌, రాజేంద్ర పాల్‌ గౌతమ్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌, గోపాల్‌ రాయ్‌, కైలాష్‌ గహ్లోత్‌ సైతం ఢిల్లీ సెక్రటేరియట్‌లో బాధ్యతలు స్వీకరించారు. గత మంత్రివర్గంలో సమర్థవంతంగా పనిచేసి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కీలక భూమిక​ పోషించిన మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్, కైలాస్‌ గహ్లోత్, గోపాల్‌ రాయ్, రాజేంద్ర పాల్‌ గౌతమ్, ఇమ్రాన్‌ హుస్సేన్‌లకు మళ్లీ కేబినెట్‌ పదవులు దక్కాయి..ఇక నిన్న రామ్ లీలా మైదానంలో కేజ్రీవాల్‌ ఢిల్లీకి మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే..

మంత్రులు- వారికి కేటాయించిన శాఖలు

1. మనీశ్‌ సిసోడియా: ఆర్థిక, ప్రణాళిక, పర్యాటకం, భూమి-భవనాలు, విజిలెన్స్‌, సర్వీసెస్‌, కళలు, సంస్కృతి, భాషలు

2. ఇమ్రాన్‌ హుస్సేన్‌: అడవులు, ఆహార సరఫరా, ఎన్నికలు

3. కైలాస్‌ గహ్లోత్: రవాణా, రెవెన్యూ, న్యాయ, శాసన వ్యవహారాలు, ఐటీ, కార్యనిర్వాహక సంస్కరణలు

4. గోపాల్‌ రాయ్‌: పర్యావరణం

5. రాజేంద్ర పాల్‌ గౌతమ్: మహిళా, శిశు సంక్షేమం

6. సత్యేందర్‌ జైన్: ఢిల్లీ జల్‌ బోర్డు (డీజేబీ)


Show Full Article
Print Article
More On
Next Story
More Stories