గాంధీనగర్‌లో మురికివాడ కనిపించకుండా అడ్డుగోడ

admin1
Updated on: 13 Feb 2020 10:05 PM IST
గాంధీనగర్‌లో మురికివాడ కనిపించకుండా అడ్డుగోడ
X

భారత టూర్‌లో భాగంగా గుజరాత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం అహ్మదాబాద్‌, గాంధీనగర్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లను శుభ్రం చేయడంతోపాటు చెట్లు నాటడం, డివైడర్లు నిర్మించడం, రోడ్డుపక్కన భవనాలకు రంగులు వేయడం... అలాగే విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి గాంధీనగర్ వెళ్లే మార్గంలో ట్రంప్‌కు మురికివాడ కనిపించకుండా అడ్డుగోడ కట్టేస్తుననారు. రహదారి పొడవునా దాదాపు ఏడు అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ గోడ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

admin1

admin1

Next Story