Yuganiki okkadu: యుగానికి ఒక్కడు సీక్వెల్‌ ఎందుకు ఆలస్యమవుతోంది? దర్శకుడు ఏమన్నారంటే

Yuganiki Okkadu
x

Yuganiki okkadu: యుగానికి ఒక్కడు సీక్వెల్‌ ఎందుకు ఆలస్యమవుతోంది? దర్శకుడు ఏమన్నారంటే

Highlights

Yuganiki Okkadu: తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన క్లాసిక్ మూవీల్లో 'యుగానికి ఒక్కడు' (తమిళంలో ‘ఆయిరత్తిల్ ఒరువన్’) మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Yuganiki Okkadu: తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన క్లాసిక్ మూవీల్లో 'యుగానికి ఒక్కడు' (తమిళంలో ‘ఆయిరత్తిల్ ఒరువన్’) మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఇటీవల తెలుగులో మళ్లీ విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది.

ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించగా, డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆర్. రవీంద్రన్ నిర్మించారు. ఇందులో కార్తీతో పాటు రీమా సేన్, ఆండ్రియా జెరెమయ్యా కీలక పాత్రలు పోషించారు. 2010లో విడుదలైన ఈ సినిమా, అప్పుడు తెలుగు మరియు తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. అయితే 11 సంవత్సరాల తర్వాత 2021లో ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు దర్శకుడు సెల్వరాఘవన్.

హీరోగా తన సోదరుడు ధనుష్ నటించనున్నట్లు తెలియజేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు సెట్స్‌ మీదకు వెళ్లలేదు. ప్రస్తుతం సెల్వా ‘7జీ బ్రిందావన్ కాలనీ’కి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెల్వరాఘవన్ ‘యుగానికి ఒక్కడు 2’ ఆలస్యం గురించి స్పందించాడు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించడం పెద్ద తప్పుగా అనిపించింది. అప్పట్లో సినిమాపై ఉన్న క్రేజ్ చూసి ప్రకటించాను. కానీ తర్వాత అంతా నన్ను అడుగుతూనే ఉన్నారు. అప్పుడే బరువు తెలిసింది. ధనుష్‌ను హీరోగా అనుకున్నా కానీ... కార్తీ లేకుండా ఈ కథను ఊహించలేను. ఈ సినిమా కోసం హీరో ఏడాది పాటు తన సమయాన్ని ఇవ్వాలి. సరైన నిర్మాత దొరికితేనే ఇది సాధ్యం. బడ్జెట్ పెద్ద సమస్య కాదు. కానీ ప్రస్తుతం VFX ధరలు తగ్గాయి. అయినా కూడా AI పెరిగిన ఈ రోజుల్లో ఇటువంటి సినిమా తీయడం సులభం కాదు' అని చెప్పుకొచ్చారు.

దీంతో దర్శకుడు ఈ వ్యాఖ్యలతో యుగానికి ఒక్కడు 2 కి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. అయినా, ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మాత్రం ఓ మంచి అప్డేట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories