భారీ బడ్జెట్ సినిమాలో నితిన్

'శ్రీనివాస కల్యాణం' సినిమాతో ముచ్చటగా మూడవ డిజాస్టర్ అందుకున్న యువ హీరో నితిన్ గత కొంత కాలంగా సైలెంట్ గా...
'శ్రీనివాస కల్యాణం' సినిమాతో ముచ్చటగా మూడవ డిజాస్టర్ అందుకున్న యువ హీరో నితిన్ గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు సినిమాలు లైన్లో పెట్టడంలో జోరు కనపరుస్తున్నాడు. 'చలో' ఫేమ్ వెంకీ కుడుములతో 'భీష్మ' సినిమా పోస్టర్ ని ఈమధ్యనే విడుదల చేశారు. ఇప్పుడు ఫ్యాన్స్ కి మరొక తీపి కబురు చెప్పాడు. తన ఓన్ ప్రొడక్షన్ లో నితిన్ ప్రొడక్షన్ నెంబర్ 6 ప్రకటించడం ఫ్యాన్స్ కి మరింత ఆనందంగా ఉంది. 'రౌడీ ఫెలో' ఫేమ్ కృష్ణ చైతన్య, నితిన్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది. 'చల్ మోహన్ రంగా' సినిమాతో అది మరింత బలపడింది.
ఇప్పుడు కృష్ణ చైతన్య వినిపించిన కథ బాగా నచ్చడంతో తన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ మీద స్వంతంగా నిర్మించేందుకు నితిన్ రెడీ అయ్యాడు. ఇది ప్యాన్ ఇండియా సినిమా అని సమాచారం. నితిన్ కెరీర్ లో మొట్టమొదటిసారిగా మూడు భాషల్లో నితిన్ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్టే భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ తో సినిమా రూపుదిద్దుకోనుంది. దీనికి 'పవర్ పేట' అనే టైటిల్ ఫిక్స్ చేసారని సమాచారం. నితిన్ ఎప్పుడూ చెయ్యని కథాంశం తో సినిమా నడుస్తుందట. మరి ఇలాంటి సినిమాతో నితిన్ ఇదివరకు ఎప్పుడూ అందుకోనంత పెద్ద హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMT