Bala Krishna: బాలయ్య కోసం యంగ్ డైరెక్టర్స్ క్యూ..

Bala Krishna: బాలయ్య కోసం యంగ్ డైరెక్టర్స్ క్యూ..
x

Bala Krishna: బాలయ్య కోసం యంగ్ డైరెక్టర్స్ క్యూ

Highlights

అన్ స్టాపబుల్ షో బాలయ్యలోని మరో యాంగిల్ ని ఆడియెన్స్ కే కాదు ఇండస్ట్రీ వర్గాలకు సైతం పరిచయం చేసింది.

Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి రూపాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఆగస్ట్ లో గుమ్మడికాయ కొట్టేస్తారని టాక్ నడుస్తోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి భగవత్ లాల్ కేసరి టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు టాక్.

అఖండ సినిమా తర్వాత బాలయ్య తన వర్కింగ్ స్టైల్ మార్చేశారు. గతంలో సీనియర్ దర్శకులతోనే సినిమాలు చేసేందుకు ఇష్టపడిన బాలయ్య ప్రస్తుతం కుర్ర హీరోలతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈక్రమంలోనే నటసింహంతో సినిమాలు తీసేందుకు కుర్ర దర్శకులు పోటీపడుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రం తర్వాత బాలయ్య తన కంఫర్ట్ డైరెక్టర్ బోయపాటితో సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10న ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందట.

బాలయ్య తో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్, గోపిచంద్ మలినేని వంటివారు లైన్ లో ఉన్నారు. అయితే వీరికి పోటీగా పలువురు యంగ్ డైరెక్టర్స్ బాలయ్య కోసం కథలు సిద్ధం చేసుకొని ఆయన అంగీకారం కోసం ఎదురుచూస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన బాబీ, బింబిసార దర్శకుడు వశిష్ట, జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ..ఈ యంగ్ టాలెంట్ అంతా వింటేజ్ బాలయ్యను స్క్రీన్ మీద చూపించాలని తహతహలాడుతున్నారు. వీరితో పాటు బలగంతో అందర్ని ఆశ్చర్యపరిచిన వేణు, విరూపాక్ష ఫేం కార్తీక్ దండు సైతం బాలయ్య కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు.

మొత్తంగా అన్ స్టాపబుల్ షో బాలయ్యలోని మరో యాంగిల్ ని ఆడియెన్స్ కే కాదు ఇండస్ట్రీ వర్గాలకు సైతం పరిచయం చేసింది. ఈ షో లో నటసింహం ఎనర్జీ లెవల్స్, జోష్ ఆయన ఫ్యాన్స్ ను మాత్రమే కాదు కుర్ర దర్శకులను సైతం ఆకర్షించింది. అందుకే, బాలయ్య లిస్టులో పలువురు కుర్ర దర్శకులు చేరుతున్నారు. ఆయన్ని ఎలా చూపిస్తే బాగుంటుందో అలాంటి కథల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఏదిఏమైనా, రాబోయే రోజుల్లో నయా నటసింహం వెండితెరపై గర్జించనుందన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories