అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్ర పోషించిన యువకుడు ఇప్పుడు హీరోగా మారిపోయాడు

అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్ర పోషించిన యువకుడు ఇప్పుడు హీరోగా మారిపోయాడు
x
Highlights

ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడైన విక్రమ్ సహిదేవ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 'రుద్రమదేవి' సినిమాలో చిన్న క్యామియో లో కనిపించిన విక్రమ్...

ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడైన విక్రమ్ సహిదేవ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 'రుద్రమదేవి' సినిమాలో చిన్న క్యామియో లో కనిపించిన విక్రమ్ 'రేసుగుర్రం' సినిమా లో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో కనిపించాడు. అంతేకాక ఈ మధ్యనే బన్నీ హీరోగా నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా లో అన్వర్ అనే పాత్ర లో కనిపించాడు విక్రమ్. అయితే ఇప్పుడు విక్రమ్ ఏకంగా సినిమా హీరోగా మారనున్నాడు. 'ఎవడూ తక్కువ కాదు' అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.

ఈ సినిమా ఒక న్యూ ఏజ్ రివెంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని తెలుస్తోంది. 'గోలి సోడా', 'వినరా సోదరా వీర కుమారా' వంటి చిత్రాల్లో నటించిన ప్రియాంక జైన్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాకు రఘు జయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం మరియు 'లైఫ్ ఈజ్ ఏ కేసినో' అని సాగే పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. లగడపాటి శ్రీధర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హరి గౌర సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటిదాకా చిన్న పాత్రలతో మెప్పించిన విక్రమ్ ఇప్పుడు హీరో గా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories